టిడిపి నుంచి గెలిచి టిఆర్ఎస్ ప్రభుత్వంలో తలసాని: స్పందించిన రాష్ట్రపతి భవన్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన తలసాని శ్రీనివాసయాదవ్ పార్టీ ఫిరాయించి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వంలో మంత్రి అయిన వ్యవహారంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ రాసిన లేఖపై రాష్ట్రపతి భవన్ స్పందించింది.
గోపినాథ్ రాసిన లేఖను కేంద్ర హోం సెక్రటరీకి పంపుతున్నామని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పురుషోత్తం దాస్ ఎమ్మెల్యేకు సమాచారం అందించారు. ఈ విషయంపై రాజభవన్ కూడా తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖ రాస్తూ మాగంటి గోపీనాథ్ చేసిన ఫిర్యాదు కాపీని దానికి జత చేసింది.

ఇదిలావుంటే, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సహా 8 మంది శాసనసభ్యులకు హైకోర్టులో ఊరట లభించింది. వీరి అనర్హతకు వేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టేసింది. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన ఎనిమిది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి.
తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెసు పార్టీకి చెందిన సంపత్ కుమార్ ఆ పిటిషన్లను స్వీకరించారు. ఆ ఆరుగురు శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఆయా పార్టీలకు చెందిన నాయకులు స్పీకర్ మధుసూదనాచారిని ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదులపై ఏ స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.
పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై చర్యలు తీసుకునే విషయంపై ఆలోచన చేయాలని హైకోర్టు స్పీకర్‌కు సూచన మాత్రమే చేసింది. స్పీకర్ పరిధిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోవడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications