Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీటీడీపీకి షాక్: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి రావుల చంద్రశేఖర్ రెడ్డి: జిట్టా బాలకృష్ణ కూడా

హైదరాబాద్: తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామన్నారు.

రైతుబంధు కింద రూ. 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసినట్లు చెప్పారు. రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేశామని.. ఎన్నికల్లోపు మిగిలిన అందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. 13 లక్షల మంది ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణలక్ష్మి ఇచ్చామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. గురుకులాల్లో 6.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు.

Ravula chandrasekhar reddy joins BRS on the presence of KTR

55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే ప్రతిపక్షాలకు కళ్ల మంట ఎందుకని ప్రశ్నించారు. ఒకప్పుడు మైగ్రేషన్ కు కేరాఫ్‌గా ఉన్న పాలమూరు ఇవాళ ఇరిగేషన్‌కు కేరాఫ్‌గా మారిందన్నారు. సముద్రతీరం లేకుండా మత్స్య సంపద పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణదే నెంబర్ వన్ స్థానం అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగును ప్రోత్సహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జ‌గ‌న్నాథంతో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. కాగా, రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి టీడీపీ త‌ర‌పున 1994, 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌న‌ప‌ర్తి నియోక‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1994లో ఏపీ ప్ర‌భుత్వ విప్‌గా ప‌ని చేశారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా ఎన్నిక‌య్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఇక్క‌డి టీడీపీ ముఖ్య నాయ‌కులు వివిధ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. రావుల మాత్రం టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. వ‌న‌ప‌ర్తి జిల్లాలో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి మంచి ప‌ట్టుంది. చంద్ర‌బాబు ఆయ‌న‌ను పొలిట్‌బ్యూరో స‌భ్యుడిగా కూడా నియ‌మించారు.

Ravula chandrasekhar reddy joins BRS on the presence of KTR

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు జిట్టా బాల‌కృష్ణారెడ్డి, టీఎన్జీవోల సంఘం అధ్య‌క్షుడు మామిళ్ల రాజేంద‌ర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో బాల‌కృష్ణారెడ్డి, రాజేంద‌ర్ గులాబీ గూటికి చేరారు. వీరిద్ద‌రికి కేటీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.ఈ సంద‌ర్భంగా జిట్టా బాల‌కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లోకి త‌న‌ను ఆహ్వానించినందుకు పార్టీ నాయ‌క‌త్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేస్తుంటే ఒళ్లు పుల‌క‌రించింది. మళ్లీ తాను తన ఇంటికి వచ్చినట్లుందన్నారు. సీఎం కేసీఆర్ త‌న‌ను మ‌నస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు ధ‌న్య‌వాదాలు చెప్పారు. రామ‌న్న‌, హ‌రీశ్ అన్న నాయ‌క‌త్వంలో అడుగులో అడుగేసి న‌డుస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. గౌర‌వం ఉన్న‌చోటుకే ఉద్య‌మ‌కారులంతా రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌ను మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొద్దామ‌న్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వ‌మే తెలంగాణ‌కు శ్రీరామ ర‌క్ష అని జిట్టా బాల‌కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+