యాదాద్రి నరసింహ స్వామి ఆలయానికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం
తెలంగాణ రాష్ట్రంలో కొలువైన కలియుగ దైవం, కోరి కొలిచిన వారి కొంగు బంగారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రదేశాలకు ఆలవాలంగా కూడా మార్చడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు యాదాద్రి కి పెద్ద సంఖ్యలో వెళుతున్నారు.
ఇక వారాంతాలలో యాదాద్రికి రద్దీ విపరీతంగా పెరిగింది. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా యాదాద్రి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక యాదాద్రి ఆలయానికి భక్తుల సంఖ్య పెరగడంతో హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. గత 28 రోజుల్లో యాదాద్రికి రికార్డు స్థాయిలో ఆదాయం రావడం ప్రధానంగా కనిపిస్తుంది.

గత నెలలో కార్తీకమాసం సందర్భంగా, అలాగే ఈ సంవత్సరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యాదాద్రి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. దీంతో ఆలయ హుండీ ఆదాయం కూడా విపరీతంగా పెరిగింది. గత 28 రోజుల్లో వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం మూడు కోట్ల 15 లక్షల 535 రూపాయలు వచ్చినట్టుగా ఆలయ అధికారులు చెబుతున్నారు.
యాదాద్రి నరసింహ స్వామి ఆలయానికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం..!#Yadadri #YadadriTemple #Hundii #Income #Telangana #Oneindiatelugu pic.twitter.com/nMooDIvUXU
— oneindiatelugu (@oneindiatelugu) January 5, 2024
యాదాద్రి కొండ కింద ఉన్న ఆధ్యాత్మిక గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో భక్తులు సమర్పించిన నగదు, ఆభరణాలు, కానుకలకు సంబంధించిన లెక్కలు నిర్వహించారు. ఈ లెక్కింపులో హుండీ ఆదాయం బాగా పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు. ఆభరణాల రూపంలో స్వామివారికి మూడు కోట్ల 15 లక్షల 535 రూపాయల నగదు వచ్చినట్టు చెబుతున్నారు.
100 గ్రాముల బంగారం, నాలుగు కిలోల రెండు వందల యాభై గ్రాముల వెండి వచ్చినట్టు చెప్తున్నారు.గతంలో కంటే నగదు ఆదాయం గణనీయంగా పెరిగినట్టు తెలుస్తుంది. గతంలో నగదు ఆదాయం 2.5కోట్లు కాగా, ప్రస్తుతం హుండీ ఆదాయం 3.15కోట్లు.












Click it and Unblock the Notifications