నరేంద్ర మోడీపై పరువునష్టం దావా వేస్తా: ఆ వీడియో బయటపెట్టిన రేణుకా చౌదరి!!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఖమ్మం జిల్లా ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తాను పరువు నష్టం దావా వేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసిసి మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్ట్ 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంపై తాజాగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న రేణుక చౌదరి తనపై మోడీ మాట్లాడిన మాటల వీడియోలు ఉన్నాయని, తాను పరువు నష్టం దావా వేస్తానంటూ స్పష్టం చేశారు.
2018లో రాజ్యసభలో చర్చల సందర్భంగా ప్రధాన నరేంద్ర మోడీ తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అన్నారని, రామాయణం తర్వాత ఇలాంటి నవ్వు వినే అవకాశం కలిగింది అంటూ పరోక్షంగా తనను శూర్పణఖతో పోలుస్తూ వ్యాఖ్యానించారని రేణుక చౌదరి పేర్కొన్నారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో సభలోని బిజెపి నాయకులంతా నవ్వారని, తనను అవమానించిన ప్రధానిపై తాను పరువు నష్టం దావా వేస్తానన్నారు.

ఇక దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి దీనిపై ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. ఇక తమ ఫిర్యాదుపై, తాము వేసే పరువు నష్టం దావాపై కోర్టు ఎంత తొందరగా స్పందిస్తుందో చూస్తామని రేణుక చౌదరి పేర్కొన్నారు.
This classless megalonaniac referred to me as Surpanakha on the floor of the house.
— Renuka Chowdhury (@RenukaCCongress) March 23, 2023
I will file a defamation case against him. Let's see how fast courts will act now.. pic.twitter.com/6T0hLdS4YW
ఇక రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన శిక్ష నేపథ్యంలో పరువు నష్టం కేసులు వేసి రాహుల్ గాంధీ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని రేణుక చౌదరి ఆరోపించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దోషిగా తేలారు. ఈ మేరకు సూరత్ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.

మోడీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ గాంధీ పై పరువు నష్టం కేసు వేశారు. విచారణ జరిపిన గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications