హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు: కఠిన చర్యలంటూ సీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చినప్పటికీ.. హైదరాబాద్ నగర పోలీసులు మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మార్గదర్శకాలు జారీ చేశారు.

వేడుకలపై తెలంగాణ సర్కారు ప్రత్యేక అనుమతులు కానీ..
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి 12 గంటల వరకూ మద్యం దుకాణాలు, అర్ధరాత్రి ఒంటి గంట వరకూ బార్లు, పబ్బుల్లో మద్యం సరఫరా ఉంటుందని మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు, నూతన సంవత్సర వేడుకలను నియంత్రించాలన్న ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇటీవల కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోలేదని న్యాయవాది చిక్కు ప్రభాకర్ బుధవారం హైకోర్టు ప్రధాన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టేందుకు పరిశీలిస్తామని హైకోర్టు దర్మాసనం పేర్కొంది.

న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు: కఠిన చర్యలంటూ సీపీ సీవీ ఆనంద్
ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మార్గదర్శకాలు జారీ చేశారు. పబ్బులు, హోటళ్లు,, కబ్ల్ లు మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించారు. న్యూ ఇయర్‌పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేసిన ఆయన.. పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు.. ఇక, స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా, ఎవరైనా కోవిడ్ రూల్స్‌ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీపీ సీవీ ఆనంద్.. ఈవెంట్లకు పరిమితికి మించి పాసులను అమ్మొద్దన్నారు. పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్నారు హెచ్చరించారు. ఈవెంట్లలో జనాలలోకి సింగర్స్ వెళ్లొద్దు అని సూచించారు. ఇక, రెండూ డోసులు తీసుకున్న వారికే మాత్రమే ఈవెంట్లకు అనుమతి ఇవ్వాలని ఈవెంట్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు.

కరోనా నిబంధనలు తప్పనిసరంటూ సీవీ ఆనంద్ వార్నింగ్
వేడుకల్లో మాస్క్ తప్పనిసరి అని, వేడుకల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకలకు రెండ్రోజుల ముందు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. సిబ్బందికి 48 గంటల ముందు కరోనా పరీక్షలు చేయాలన్నారు. వేడుకల్లో డ్రగ్స్ అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ హెచ్చరించారు.
ఇక, డిసెంబర్ 31వ తేదీన రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్టు వెల్లడించారు.. తాగి రోడ్లపై హంగామా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే తీవ్ర చర్యలు తప్పవని.. 31న రాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తాం.. మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications