వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారు ఐరన్ లెగ్‌లు, వారివల్లే టీడీపికి శని: కడియం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth and Errabelli are iron legs to TDP: Kadiyam
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డిలు ఇద్దరు ఐరన్ లెగ్‌లు అని, వారిద్దరి వల్లే ఆ పార్టీసి శని అని, 2004 నుండి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రులు అవుదామని ఎదురు చూస్తున్నారని, కానీ ఆ పార్టీ అధికారంలోకి రావడం లేదని వరంగల్ తెరాస ఎంపీ కడియం శ్రీహరి శనివారం విమర్శలు గుప్పించారు.

తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు చేపట్టిన బస్సుయాత్ర లో తెలంగాణ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన చేసిన విమర్శలను కడియం ఖండించారు. ఎవరి వైఫల్యంతో తెలంగాణలో విద్యుత్తు కష్టాలు వస్తున్నాయో బహిరంగ చర్చకు వస్తే నిరూపిస్తామన్నారు.

కాంగ్రెస్‌, టీడీపీలు లోపాయికారి ఒప్పందం చేసుకుని ప్రణాళికాబద్ధంగా తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. ఈ రెండు పార్టీల వల్లనే తెలంగాణలో అంధకారం నెలకొందని, సిగ్గులేకుండా మళ్లీ యాత్రల పేరుతో పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.

ఇన్నేళ్లుగా తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపిన ఆ పార్టీలు ఇప్పుడు కపట ప్రేమ ఒలకబోస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్‌‌ను బక్కోడని అంటున్న టీడీపీ నాయకుల 17సంవత్సరాల పాలనను చూసిన ప్రజలు వారినే బండకేసి కొట్టారన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. బక్క పల్చని వ్యక్తే చంద్రబాబును బెజవాడకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడు తూ తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలను ప్రజలు విశ్వసించడంలేదని, రేవంత్ రెడ్డి ఇలా గే ఆరోపణలు చేస్తుంటే రాజకీయాలనుంచి వైదొలిగే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

రైతు ఆత్మహత్య

అప్పుల బాధలు భరించలేక కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మోతె గ్రామ పంచాయతి అనుబంధ గ్రామం గౌండ్ల పల్లికి చెందిన ఊకంటి మధుసూదన్ రెడ్డి (44) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మృతునికి ఎకరం వ్యవసాయ భూమి ఉంది దానికి తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు.

ఎకరంలో మొక్కజొన్న పంట మరో రెండెకరాల్లో పత్తి పంట వేశాడు. వర్షాలు లేక పోగా విద్యుత్తు సమస్య వల్ల వేసిన పంటలు ఎండి పోయాయి. గత సంవత్సరం అతివృష్టితో చేతికి వచ్చిన పంటలు నీటి పాలు కాగా ఇప్పుడు అనావృష్టితో పంటలు ఎండి పోయి రూ. 4 లక్షలు అప్పులు మిగిలాయి.

పెట్టుబడులు పెట్టి వేసిన పంటలు ఎండి పోవటంతో అప్పులు తీర్చే మార్గం లేక ఆందోళన చెందిన రైతు శుక్రవారం రాత్రి తన వ్యవసాయ చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
Revanth Reddy and Errabelli Dayakar Rao are iron legs to TDP, says Kadiyam Srihari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X