దాంతో రేవంత్, చంద్రబాబు బయటపడతారా: అలా ఎలా.. సందేహాలెన్నో?

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి సోమవారం నాడు కోర్టుకు హాజరయ్యారు. రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాల జ్యూడిషియల్ రిమాండును న్యాయస్థానం 29వ తేదీ వరకు పొడిగించింది.

మరోవైపు, రేవంత్ కేసులో ఏసీబీ వ్యవహరించిన తీరు పైన టీడీపీ న్యాయనిపుణుల సలహా తీసుకుంటోంది. రేవంత్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే సాక్ష్యాలను సేకరించారని టీడీపీ వాదిస్తోంది. మే 28 నుంచి 31 వరకు జరిగిన పరాణామాలపై తెలంగాణ ఏసీబీ దాఖలు చేసిన పోలీసు రిమాండు నివేదిక ఆధారంగా టీడీపీ ఓ విశ్రాంత న్యాయమూర్తి నుంచి న్యాయ సలహా తీసుకుంటుందని తెలుస్తోంది.

నివేదిక ప్రకారం వారిలో పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వస్తున్న వార్తల ప్రకారం...

చంద్రబాబు, రేవంత్

చంద్రబాబు, రేవంత్

ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతలు సీనియర్ న్యాయనిపుణులు, విశ్రాంత న్యాయమూర్తుల సలహాలు తీసుకుంటున్నారని సమాచారం.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఓటుకు నోటు వ్యవహారంలో తన పైన రాజకీయ దురుద్దేశ్యంతో కేసు పెట్టారని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. స్టీఫెన్ సన్ ఇచ్చిన ఫిర్యాదులో గానీ, ఎఫ్ఐఆర్‌లో గాని తాను ప్రేరేపించినట్లు లేదని చెప్పారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

బెయిల్ పైన విడుదలైతే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేస్తాన్న పోలీసుల వాదన సరికాదని రేవంత్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆడియో, వీడియోల ఆధారంగా పోలీసులు కస్టడీకి అడగటం సరికాదన్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

నాలుగు రోజులు కస్టడీలోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరిపినా, ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు.

రేవంత్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా సాక్ష్యాలను ఎలా సేకరించారు?

ఆ సమయానికి ఫిర్యాదుదారుడు, నిందితుల మధ్య సమావేశం ఉన్నట్లు డీఎస్పీకి ఎలా తెలిసింది? పోలీసు రికార్డుల్లో వివరాలు ఏమీ లేవు.

ఫిర్యాదు ప్రతిని డీఎస్పీ మే 28న ఏసీబీ డీజీ నుంచి అందుకున్నారు. డీఎస్పీ సంఘటన స్థలానికి వెళ్లడానికి ముందు డీజీ నిర్దేశాల ప్రకారం సదరు ఫిర్యాదులోని నిజానిజాల నిర్ధారణకు ఎలాంటి సాక్ష్యాధారాలు సేకరించారన్న వివరాలూ పోలీసు రికార్డుల్లో లేవు.

ఎవరి ఆదేశాలతో మే 31న రికార్డింగుకు అవసరమైన ఆడియో, వీడియో సరంజామా, పోలీసు బృందంతో డీఎస్పీ ఆ ఇంటికి వెళ్లారు?

సంఘటన రోజున ఆ సమయానికి నిందితుడు నగదు ఇవ్వడానికి మాల్కం టేలర్ ఇంటికి వెళ్తున్నట్లు పోలీసులకు ఎలా సమాచారం అందిందో రిమాండు నివేదికలో చెప్పలేదు.

వల వేయడానికి ముందే ఫిర్యాదుదారుని ప్రశ్నించారా? ఒకవేళ ప్రశ్నిస్తే ఆయన ఏమని వాంగ్మూలం ఇచ్చారు?
కోర్టుకు సమర్పించిన పోలీసు రికార్డుల్లో ఈ ప్రస్తావన లేదు.

దీంతో ఫిర్యాదుదారుని ప్రశ్నించకుండా, నిబంధనలు అనుసరించకుండా, న్యాయస్థానం అనుమతి తీసుకోకుండా డీఎస్పీయే వలవేసి ఆ తర్వాత అరెస్టు చేసినట్లు జరిగిన పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ విశ్లేషణ ప్రకారం ఈ కేసుకు ఏసీబీ చట్టం వర్తించదని, నిందితుడిని అరెస్టు చేసేందుకు ఏసీబీ డీఎస్పీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమైనదని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+