కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి కీలక పదవి: 9 కమిటీలు, చైర్మన్లు వీరే
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కీలక పదవి దక్కింది. రేవంత్‌తో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. తెలంగాణ పీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు తొమ్మిది కమిటీలు ఏర్పాటు చేశారు.
క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, కో చైర్మన్‌గా డీకే అరుణ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, కో చైర్మన్‌గా కోమటిరెడ్డి, స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌గా వీ హనుమంత రావు, ఈసీ సమన్వయ కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి, పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా కోదండరెడ్డిలను నియమించారు.

15 మందితో కోర్ కమిటీని, 53 మందితో కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసారు. 17 మందితో ప్రచార కమిటీ, 41 మందితో ఎలక్షన్ కమిటీ, 35 మందితో మేనిఫెస్టో కమిటీ, 20 మందితో స్ట్రాటజీ కమిటీలను నియమించారు. సురేష్ రెడ్డిని మూడు కమిటీల్లో వేశారు. ప్రచార కమిటీ కో చైర్మన్‌గా డీకే అరుణ, ప్రచార కమిటీ కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్‌ను నియమించారు.
గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా ప్రజలతో మాట్లాడుతారని, వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తారని, కానీ మేం సంవత్సరం నుంచి రాఫెల్ స్కాం గురించి అడుగుతున్నా స్పందించడం లేదన్నారు. పార్లమెంటులో ప్రశ్నలు అడిగి విసిగిపోతున్నామన్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వని ప్రధాని ఉండటం దేశంలో మొదటిసారి అన్నారు. రాఫెల్ యుద్ద విమానం డీల్ చేసిన వ్యక్తే మౌనంగా ఉంటున్నారని అన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications