Revanth Reddy: రేవంత్ రెడ్డి సీఎం అయితే టీడీపీకి ఆ ఆరుదైన రికార్డు...!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రేపో మాపో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఇవాళ జరిగే సీఎల్పీ నేత ఎంపిక భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్లు కూడా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమనే చెప్పవచ్చు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వస్తోంది. అలాగే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తొలి సీఎంగా కూడా రికార్డులకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి మరో రికార్డు కూడా సృష్టించబోతున్నారు. గతంలో టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కానుండటంతో ఆ అరుదైన రికార్డు ఆయన సొంతం కాబోతోంది.

గతంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత పలువురు నేతలు ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు. అలాగే టీడీపీ నుంచి బయటికి వెళ్లిన తర్వాత ఇతర పార్టీల నుంచి కూడా సీఎంలు అయ్యారు. ఇలా ఇప్పటివరకూ నలుగురు టీడీపీ నేపథ్యం కలిగిన వారు సీఎంలు అయ్యారు. ఈ జాబితాలో టీడీపీ వ్యవస్ధాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ తో పాటు నాదెండ్ల భాస్కరరావు, నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయితే టీడీపీ ఫ్యాక్టరీ నుంచి వచ్చి సీఎం అవుతున్న ఐదో నేత కానున్నారు.
గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా, పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన రేవంత్ రెడ్డి.. అనంతరం 2021లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తన అసాధారణ పనితీరుతో కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో పాటు కేవలం ఆరునెలల్లో అధికారంలోకి తెచ్చారు. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు తెలంగాణలో మార్మోగుతోంది. అలాగే చంద్రబాబు శిష్యుడిగా పేరున్న రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కానుండటం తన మాజీ పార్టీ టీడీపీకి కూడా ఏపీలో ఉపయోగపడనుంది.












Click it and Unblock the Notifications