హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్! దమ్ముందా, తెలంగాణ వచ్చాక ఆంధ్రావాళ్లపై ప్రేమ: రేవంత్ రెడ్డి మళ్లీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికల పైన సవాల్ చేశారు.

తెరాస ప్రభుత్వానికి దమ్ముంటే మేయర్ ఎన్నికలను ప్రత్యక్షంగా నిర్వహించాలని సవాల్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి పైన బహిరంగ చర్చకు సిద్ధమా అని వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపితోనే తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుందని చెప్పారు.

Revanth Reddy challenges KCR over Hyderabad mayor elections

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, తెరాస ఆంధ్రా వాళ్ల పైన ప్రేమ చూపుతోందంటూ ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రా ఓటర్లు హైదరాబాదులో ఉండటంతో... వారికి అనుకూలంగా తెరాస మాట్లాడుతోన్న విషయం తెలిసిందే.

ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. త్వరలో సిద్దపేట నియోజకవర్గాన్ని వంద శాతం బెంచీలు ఉన్న పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆయన శుక్రవారం నాడు 53 ప్రభుత్వ పాఠశాలలకు బెంచీలు, చెత్త డబ్బాలు పంపిణీ చేశారు.

తెలంగాణ , సీమాంధ్ర ప్రజలకు తండ్రీ కొడుకులు (కెసిఆర్, కెటిఆర్) చేసిందేమీ లేదన్నారు. ఓట్ల అవసరాన్ని బట్టి అవసరమైన ముసుగులు తొడుక్కుంటున్నారని దుయ్యబట్టారు.

సీమాంధ్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌లో స్థిరపడిన వారు కేటీఆర్‌ మోసపూరిత మాటలను నమ్మవద్దన్నారు. పరోక్ష పద్ధతిలో మేయర్‌ ఎన్నిక జరిగితే సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కార్పోరేటర్లను కొనుగోలు చేసి మేయర్‌ పదవిని దక్కించుకుంటారని ఆరోపించారు.

English summary
Revanth Reddy challenges KCR over Hyderabad mayor elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X