మిగతా మంత్రివర్గంతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్!!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి పరిపాలనను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ తో పాటు, ఎమ్మెల్సీ మరియు నామినేటెడ్ పదవుల ఎంపికకు ఫోకస్ చేస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఆరుగురు మంత్రులు, ఉపాధ్యక్షుడు, చీఫ్ విప్, విప్ లను ఎంపిక చేయాల్సి ఉండగా, ఈ ఎంపికను త్వరితగతిన పూర్తిచేయాలని రేవంత్ భావిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మిగిలిన మంత్రివర్గ విస్తరణ తోపాటు నామినేటెడ్ పదవుల భర్తీపై ఫోకస్ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని కీలకమైన పోస్టులలో సమర్థవంతమైన అధికారులను నియమించుకుంటున్నారు. సీఎం తన వ్యక్తిగత ముగ్గురు కార్య దర్శకుల నియామకాల్లో కూడా సామాజిక సమీకరణలు పాటించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణలో ఆరు స్థానాలకు రెండు రెడ్డి సామాజిక వర్గానికి, బీసీలకు రెండు, ఎస్ టి కి ఒకటి, ఎస్సీ కి లేదా మైనారిటీలకు ఒకటి చొప్పున మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి సీఎం రేవంత్ రెడ్డి తన అత్యంత సన్నిహితుడిగా భావించే వేం నరేందర్ రెడ్డి కి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
టిఎస్పిఎస్సి చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రభుత్వ సలహాదారుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ కు అవకాశం ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలతో మాట్లాడి మంత్రివర్గ విస్తరణ తో పాటు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
మొత్తంగా నామినేటెడ్ పదివేల పైన కూడా ఫోకస్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఎవరు ఏ విభాగానికి సరిపోతారో చూసి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాల భోగట్టా. అయితే రేవంత్ రెడ్డి సమర్ధంగా పాలన సాగాలంటే సమర్ధుల అవసరం ఉందని ఆలోచిస్తున్న క్రమంలో నామినేటెడ్ పోస్టులలో కూడా మంచి నాయకులనే సెలెక్ట్ చేస్తారని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications