హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఆంధ్రజ్యోతి'కి రేవంత్ రూ.1లక్ష విరాళం, మాకు సంబంధం లేదు: కెసిఆర్‌కు కోదండ ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సంక్షేమ నిధికి తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రూ.1 లక్ష విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఇచ్చే లక్ష రూపాయలతో రైతుల కష్టాలు తీరవన్నారు.

ప్రభుత్వం రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల అవస్థలను గురించి పూర్తిస్థాయిలో అర్థం చేసుకొని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని మండిపడ్డారు.

కాగా, తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాలకు సాయం చేసేందుకు ఆంధ్రజ్యోతి రైతు సంక్షేమ నిధిని ప్రారంభించింది. దీనికి తానే తొలి చేయిని వేసింది.

రూ.20 లక్షలతో ఖాతా తెరిచింది. ఎవరైనా సాయం చేయాలనుకుంటే తమ బ్యాంక్ ఖాతాకు పంపించాలని విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి స్పందించారు.

Revanth Reddy gives Rs.1 lakh, Kodanda gives shock to KCR

తెలంగాణకు 13వ ర్యాంక్ రావడంలో ఆశ్చర్యం లేదు: లక్ష్మణ్

ప్రపంచ బ్యాంకు ప్రకటించిన పెట్టుబడుల సానుకూల రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి 13వ ర్యాంక్ రావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని తెలంగాణ బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం అసమర్థత వల్లే రాష్ట్రం వెనుకబడిందని ధ్వజమెత్తారు.

తెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రత్యేకంగా మూడు రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తలా, తోక లేని నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుతో మొట్టికాయలు కూడా వేయించుకుంటుందని ధ్వజమెత్తారు. ప్రతి విషయంలో అసమర్థత కనిపిస్తోందన్నారు.

మాకు ఏ ఎన్నికలతోనూ సంబంధం లేదు: కోదండరాం

వరంగల్ ఉప ఎన్నికకు జేఏసీ దూరంగా ఉంటుందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ఆచార్య కోదండరాం ప్రకటించారు. ఇక నుంచి తమకు ఏ ఎన్నికలతోనూ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. తద్వారా కెసిఆర్‌కు కోదండ షాకిచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

జేఏసీ ఆధ్వర్యంలో రేపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. దేశంలో విదర్భ తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్లు హింసను ప్రేరేపిస్తాయంటూ వరంగల్ ఎన్‌కౌంటర్ పైన స్పందించారు.

టీఆర్ఎస్ దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తకు రేవంత్ పరామర్శ

టీఆర్ఎస్ వర్గీయలు చేసిన దాడిలో గాయపడి.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త చందూలాల్‌ను బుధవారం రేవంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని టీడీపీ నేతలను టీఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరని టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. చందూలాల్ పైన దాడికి దిగిన వారిని వెంటనే అరెస్ట్ చేయాని డిమాండ్ చేశారు.
చందూలాల్ కుటుంబాన్ని టీడీపీ ఆదుకుంటుందన్నారు.

English summary
Revanth Reddy gives Rs.1 lakh, Kodanda gives shock to KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X