ఉత్కంఠకు తెర: టీడీపీకి గుడ్ బై, కాంగ్రెస్‌లోకి వెళ్తే రేవంత్ ఉనికి ఇలా!..

Subscribe to Oneindia Telugu
  Revanth Reddy Resigned For TDP ఉత్కంఠకు తెర.. టీడీపీకి గుడ్ బై..

  అమరావతి: టీటీడీపీలో రేవంత్ ఎపిసోడ్ ఇక ముగిసింది. ఇన్నాళ్లు నానుస్తూ వస్తున్న ఆయన వ్యవహారానికి 'గుడ్ బై'తో తెరపడింది. అమరావతిలో అధినేత చంద్రబాబుతో జరిగిన సమావేశం అనంతరం రేవంత్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

  తెలుగు దేశం పార్టీ సభ్యత్వానికి రేవంత్ రాజీనామా చేశారు. రేవంత్ రాజీనామాతో ఇక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనంగా మారిపోయింది. కేసీఆర్ ను ఎదుర్కోవడానికి ఆయన తదుపరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నదే ఇక ఆయన రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయి.

   తెలియదన్న బాబు:

  తెలియదన్న బాబు:

  రేవంత్ రాజీనామా విషయం తనకు తెలియదని అధినేత చంద్రబాబు పేర్కొనడం గమనార్హం. తనకైతే ఇంతరవకు రాజీనామా లేఖ అందలేదని ఆయన తెలిపారు. మరోవైపు రాజీనామా లేఖను చంద్రబాబుకు రేవంతే స్వయంగా అందజేసినట్టు తెలుస్తోంది. భోజనానికి వెళ్తున్నానని చెప్పి రేవంత్ బయటకు వెళ్లగా.. ఆయన తిరిగి వచ్చి చంద్రబాబును కలుస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు.

   కాంగ్రెస్ లోను దూకుడు కొనసాగుతుందా?

  కాంగ్రెస్ లోను దూకుడు కొనసాగుతుందా?

  రేవంత్ రాజీనామాతో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారనుంది. కాంగ్రెస్ లో ఆయన చేరిక లాంఛనమే అయినప్పటికీ.. అక్కడ ఆయనకు దక్కే ప్రాధాన్యత పైనే రేవంత్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే సహజంగానే దూకుడు తత్వం కలిగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోను తనకంటూ సొంత ఇమేజ్, అనుకూల వర్గాన్ని ఏర్పాటు చేసుకోకపోవడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు.

  ప్రస్తుతానికి సర్దుకుపోయినా

  ప్రస్తుతానికి సర్దుకుపోయినా

  ప్రస్తుతానికి కాంగ్రెస్ సీనియర్లు పార్టీలో రేవంత్ ప్రాధాన్యంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. క్రమేపీ వారందరిని రేవంత్ చల్లబరిచే సూచనలు కనిపిస్తున్నాయి. వారి షరతులకు ఒప్పుకుంటూనే రేవంత్ పార్టీలో చేరే అవకాశాలున్నా.. తన అసలు టార్గెట్ సీఎం సీటే కాబట్టి.. మున్ముందు అందుకు అనుగుణంగా పావులు కదిపే అవకాశముంది.

  చాకచక్యంగా వ్యవహరిస్తేనే:

  చాకచక్యంగా వ్యవహరిస్తేనే:

  టీడీపీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో.. రేవంత్ తన రాజకీయాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇన్నాళ్లు టీడీపీలో తానేం చేసినా చెల్లిపోయింది కానీ కాంగ్రెస్ లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. మహాసముద్రంలా పేర్కొనే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చాకచక్యంగా వ్యవహరిస్తే తప్ప.. టీడీపీలో లాగా అనతి కాలంలోనే ఇక్కడ కూడా పార్టీని తనవైపు తిప్పుకోలేరు. కాబట్టి ఇకనుంచి రేవంత్ ప్రతీ అడుగు కీలకంగానే మారనుంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana telugu desam working president Revanth Reddy resigned for Tdp

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి