కొడంగల్ లో రేవంత్ రెడ్డి భారీ విజయం: రాష్ట్రమంతా కాంగ్రెస్ వేవ్!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయాల పరంపర కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చాలా నియోజకవర్గాలలో విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. కొన్నిచోట్ల ప్రత్యర్థులకు బలమైన పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ రథసారథి టీపీసీసీ రేవంత్ రెడ్డి కొడంగల్ లో విజయం సాధించారు. పట్నం నరేందర్ రెడ్డి పై 32 వేల 800 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. పట్నం నరేందర్ రెడ్డి కోసం కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కెసిఆర్ కాళ్లు మొక్కి అయినా నరేందర్ రెడ్డి కి కీలక పదవి ఇప్పిస్తా అని చెప్పినప్పటికీ కొడంగల్ ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపారు.

గత ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించిన కొడంగల్ ప్రజలు ఈ ఎన్నికల్లో తిరిగి పట్టం కట్టారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాల పరంపర కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియ నాయక్ పై 25 వేల మెజారిటీతో విజయం సాధించారు.
రామగుండంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజయం సాధించారు. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై విజయం సాధించారు. ఇదిలా ఉంటే పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని విజయం సాధించారు. ఆమె ఎర్రబెల్లిని ఓడించారు. నారాయణఖేడ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.
వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ విజయం సాధించారు. ఖమ్మం అశ్వరావుపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు, రామగుండంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ములుగులో సీతక్క, వర్ధన్నపేటలో కేఆర్ నాగరాజు విజయం సాధించారు. ఇక హుజూర్నగర్లో 46 వేల మెజారిటీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు ఆందోల్ లో దామోదర రాజనర్సింహ, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ విజయాలను నమోదు చేశారు.












Click it and Unblock the Notifications