రేవంత్ రెడ్డికి మళ్ళీ అవమానం... ఈసారి వైరా ఎమ్మెల్యే వంతు!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వరుస అవమానాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలోకి మంచి పనులు చేసే దూకుడుగా వెళ్లాలని భావించిన ఆయనకు అడుగడుగునా ఆయన పేరు మరిచిపోతున్న నేతల తీరు తలనొప్పిగా మారింది.

సీఎంగా రేవంత్ రెడ్డి పేరు మరచిపోతున్న కాంగ్రెస్ నేతలు
పుష్ప టు సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ తో మొదలైన రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం ప్రస్తుతం వారి పార్టీ ఎమ్మెల్యేలలో కనిపిస్తుంది..ఎక్కడకు వెళ్ళినా ఊహించని విధంగా సీఎంగా రేవంత్ రెడ్డి పేరు గుర్తు పెట్టుకోవటం లేదు. ఇటీవల కాలంలో జగ్గారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు సైతాన్ రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు. ఇక జూపల్లి కృష్ణారావు తెలంగాణ సీఎం కేటీఆర్ అనడం కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.

Revanth Reddy is humiliated again This time CM Name forgot by congress wyra MLA

సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన వైరా ఎమ్మెల్యే
ఇక ఇదే సమయంలో తాజాగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి రాజీవ్ కెనాల్ పూర్తి కావడంతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేరును మర్చిపోయారు. ముఖ్యమంత్రి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అంటూ ఆయన తడబడ్డారు.

షాకిచ్చిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వ్యాఖ్యలు
పక్కనుండి ఎవరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అందించడంతో మళ్ళీ రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలకు కూడా రేవంత్ రెడ్డి పేరు గుర్తులేదు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి పేరును పార్టీ నేతలు గుర్తుపెట్టుకోని క్రమంలో తాజాగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చేసిన వ్యాఖ్యలు మరోమారు రేవంత్ కు జరిగిన అవమానాలపైన చర్చకు కారణమయ్యాయి.

సీఎం పేరు మర్చిపోవటంపై టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షం
ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేరును మరిచిపోతున్న తీరు మాత్రం అందరికీ ఒక ఇంత ఆశ్చర్యాన్ని, ఒకింత షాక్ ను కలిగిస్తుంది. ప్రజల మెప్పు పొందటం కోసం రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలలోకి బలంగా వెళ్ళటం లేదు. అసలు ఆయన పేరే జనం మర్చిపోతున్నారని, అందుకు కాంగ్రెస్ నాయకులు పేరు మర్చిపోవటమే ఒక ఉదాహరణ అని చెప్తూ ప్రతిపక్షం కూడా ఆయనను టార్గెట్ చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+