రేవంత్ కు జగన్ తరహా "పెద్దల" కష్టాలు- కేసీఆర్ చేతికి చిక్కేదక్కడే..!!
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే రేవంత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. స్వపక్షంలోని విపక్షం..గ్యారంటీల అమలు.. ఆర్దిక పరిస్థితులు...ముంచుకొస్తున్న లోక్ సభ ఎన్నికలు రేవంత్ సమర్ధతకు పరీక్షగా నిలవనున్నాయి. ఇదే సమయంలో రేవంత్ నిర్ణయాలు తీసుకున్నా..చట్టంగా మార్చటంలో కేసీఆర్ బలం అడ్డుగా నిలిచే అవకాశం ఉంది. జగన్ తరహా సమస్యలు రేవంత్ కు తప్పవనే వాదన ఉంది.
మండలిలో కేసీఆర్ ఆధిపత్యం:తెలంగాణ పాలనలో పూర్తిగా మార్పులు చేస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించారు. రేపు ప్రమాణ స్వీకారం తరువాత ఈ నెల ద్వితీయార్ధంలో తెలంగాణ కొత్త సభ కొలువు తీరనుంది. రేపు ముఖ్యమంత్రిగాప్రమాణ స్వీకారం చేస్తూనే రేవంత్ తన పాలనలో తీసుకువచ్చే కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. ఇక..అసెంబ్లీలో రేవంత్ కు సంఖ్య పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతిపక్షాలు విభేదించినా..తన నిర్ణయాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ.. శాసనసభలో ఆమోదం పొందిన నిర్ణయాలు..బిల్లులు శాసనమండలిలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తరువాతనే చట్టంగా మారుతుంది. ఇక్కడే రేవంత్ కు అసలు సమస్య ఉంది. ఏపీలో జగన్ తన నిర్ణయాల అమలులో తొలి మూడేళ్ల కాలంలో శాసనమండలిలో ఇదే తరహా సమస్యలు ఎదుర్కొన్నారు.

జగన్ తరహా ఇబ్బందులు:ఏపీలో జగన్ 151 ఎమ్మెల్యేల సంఖ్యా బలంతో అధికారంలోకి వచ్చారు. మూడు రాజధానుల బిల్లులను అసెంబ్లీలో సులువుగా ఆమోదించుకున్నారు. కానీ, మండలిలో మాత్రం బ్రేకులు పడ్డాయి. రెండు సార్లు జగన్ అక్కడ బిల్లుల ఆమోదానికి ప్రయత్నించి విఫలమయ్యారు. చివరు అక్కడ బిల్లుల వ్యవహారం సైతం కోర్టుకు చేరింది. ఇక..ఇప్పుడు తెలంగాణలోనూ మండలిలో పూర్తిగా బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతోంది. మండలిలో 40 సీట్లకుగాను.. 28 మంది టీఆర్‌ఎస్ పార్టీ వారే ఉన్నారు. ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒక్కరు, ఉపాధ్యాయ సంఘాల నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. ఇక్కడే రేవంత్ కు అసలు చిక్కులు ప్రారంభం కానున్నాయి. మరి రెండేళ్లు శాసన మండలిలో కేసీఆర్ పార్టీ ఆధిపత్యం కొనసాగనుంది. ఎమ్మెల్సీలుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురు సభ్యులు మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
రేవంత్ నిర్ణయాలకు బ్రేకులు:బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలైన కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి , పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇక స్థానిక సంస్థల కోటా సభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు. ప్రస్తుత సంఖ్యా బలం మేరకు మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బిల్లులను ఆపటం కేసీఆర్ కు కష్టం కాదు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీల రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తే తప్ప 2025 వరకు ఇతర ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం కూడా లేదు. కానీ రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. దీంతో, ఈ నాలుగు స్థానాల భర్తీ పైన ఇప్పటికే రేవంత్ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్ని ఎమ్మెల్సీగా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో.. మండలిలో పూర్తి ఆధిపత్యం దక్కాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ పార్టీని ఏకపక్షంగా గెలిపించుకుంటే సాధ్యం అయ్యే అవకాశం ఉంది.
-
KCR మాస్ వార్నింగ్! డీలిమిటేషన్ పై కేంద్రానికి స్ట్రాంగ్ మెసేజ్ -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications