రేవంత్‌కు ఝలక్‌లు: టీడీఎల్పీలో నేమ్ ప్లేట్ తొలగింపు, ఢిల్లీలో ఏపీ-టీ అధికారులు నో

Posted By:
Subscribe to Oneindia Telugu
  కాంగ్రెస్ కాకుంటే మరోటి : రేవంత్‌కు ఝలక్‌లు

  హైదరాబాద్: అసెంబ్లీలో టీడీఎల్పీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి నేమ్ ప్లేట్ తొలగించారు. రేవంత్ రెడ్డి టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నేమ్ ప్లేట్‌ను సోమవారం తొలగించారు.

  అభిమానులు రాకుండా అడ్డుకుంటున్నారు

  అభిమానులు రాకుండా అడ్డుకుంటున్నారు

  మరోవైపు, రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలుస్తోంది. అభిమానులు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని అంటున్నారు.

  ఏపీ భవన్‌లో గదుల నిరాకరణ

  ఏపీ భవన్‌లో గదుల నిరాకరణ


  మరోవైపు, ఢిల్లీలోని కర్నాటక భవన్‌లో రేవంత్ రెడ్డి పేరిట 30 గదులు బుక్ అయిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు ఏపీ భవన్‌లో గదులు ఇచ్చేందుకు నిరాకరించారని తెలుస్తోంది.

  అధికారుల నిరాకరణ

  అధికారుల నిరాకరణ

  రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి రానున్నారు. మంగళవారం ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరిట ఢిల్లీలో గదులు బుక్ చేసుకుందామనుకుంటే ఏపీ భవన్‌లో అధికారులు నిరాకరించారని తెలుస్తోంది.

  గదులు ఖాళీ లేవని చెప్పారు

  గదులు ఖాళీ లేవని చెప్పారు

  తమ అనుచరులకు బస ఏర్పాట్ల కోసం ఏపీ భవన్‌ను సంప్రదించగా రెండు రాష్ట్రాల అధికారులు గదులు ఖాళీ లేవని చెప్పారని తెలుస్తోంది. ఏపీ భవన్ ప్రస్తుతం రెండు భాగాలుగా ఉండగా ఒకటి తెలంగాణ సర్కార్, మరో భాగం ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీంతో కర్నాటక భవన్‌లో గదులు అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Assembly officials removed Revanth Reddy name plate from Telugu Desam LP on Monday morning.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి