రేవంత్ రెడ్డి సంచలనం: కేసీఆర్ కు పీకే ఉంటే కాంగ్రెస్ కు 40లక్షల ఏకే-47లు; తగ్గేదేలే!!

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోమారు ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏకే 47 లాంటి కార్యకర్తలు ఉన్నారని, 40 లక్షల మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని పేర్కొన్నారు. 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలను చేసి తెలంగాణా కాంగ్రెస్ దేశంలో నెంబర్ వన్ గా నిలిచింది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్ సభ్యత్వాల జోరు.. రేవంత్ వ్యాఖ్యలు

తెలంగాణాలో కాంగ్రెస్ సభ్యత్వాల జోరు.. రేవంత్ వ్యాఖ్యలు


తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల వరకు సభ్యత్వాలను పెంచాలన్న రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో 80 లక్షల ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు సునాయాసం అవుతుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై మాట్లాడిన రేవంత్ రెడ్డి సభ్యత్వం చేసిన వారికి రెండు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నామని, ఈ ఇన్సూరెన్స్ ల పర్యవేక్షణ కోసం ఒక కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తామని, పవన్ మల్లాదికి ఇన్సూరెన్స్ సెల్ కో ఆర్డినేటర్ బాధ్యతను అప్పగిస్తామని వెల్లడించారు.

 కేసీఆర్ కు పీకే ఉంటే కాంగ్రెస్ పార్టీకి 40 లక్షల మంది ఏకే-47లు

కేసీఆర్ కు పీకే ఉంటే కాంగ్రెస్ పార్టీకి 40 లక్షల మంది ఏకే-47లు


కెసిఆర్ కు పీకే ఉంటే కాంగ్రెస్ పార్టీకి 40 లక్షల మంది ఏకే-47 లాంటి వారు ఉన్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ఇదే తార్కాణం అంటూ రేవంత్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కెసిఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు వచ్చాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కష్టపడి పని చేసిన వారికే టికెట్లు .. రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

కష్టపడి పని చేసిన వారికే టికెట్లు .. రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించేలా సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రామాణికంగా తీసుకుంటున్నామని అన్నారు. సభ్యత్వంలో బలంగా పని చేసిన వారికే టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పని చేయని వారికి టికెట్ తో పాటు, ఎలాంటి పదవి రాకుండా తన అడ్డుకుంటానంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా కష్టపడిన వాళ్ళకు టికెట్ ఇచ్చే హామీ నాదని, ఈ విషయంలో అవసరమైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లతో తాను మాట్లాడతానని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

టికెట్ ఆశించే అభ్యర్థులు జాగ్రత్తగా పని చేయాలన్న రేవంత్ రెడ్డి

ఇక ఇదే సమయంలో ప్రతి బూత్ నుంచి వంద మంది సభ్యత్వం ఉంటేనే ఆ నియోజకవర్గంలో పిసిసి మెంబర్ ఉంటుందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. కనీసం వంద మంది సభ్యత్వం లేకుండా ఎంత పెద్ద నాయకుడు ఉన్నా వారికి పిసిసి సభ్యత్వం ఇవ్వమని తేల్చి చెప్పారు. టికెట్ల ఎంపిక విషయంలో డిల్లీ నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారని, కాబట్టి టికెట్ ఆశించే అభ్యర్థులు జాగ్రత్తగా పని చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీ సభ్యత్వం ఉన్న వారికే మొదటి ప్రాధాన్యత అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్టీ సమావేశానికి రాకుండా ఉండేవారికి, లైట్ తీసుకునేవారికి పదవుల ఎంపికలో అవకాశాలు కల్పించమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Recommended Video

    Dharani Portal మొత్తం త‌ప్పుల మ‌య‌మే, అందుకే గొడవలు - Revanth Reddy Pressmeet | Oneindia Telugu
    కేజ్రీవాల్ ను కలుస్తానన్న కేసీఆర్ పై రేవంత్ సెటైర్

    కేజ్రీవాల్ ను కలుస్తానన్న కేసీఆర్ పై రేవంత్ సెటైర్


    అంతేకాదు తెలంగాణ సీఎం కెసిఆర్ పై విరుచుకుపడిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించేందుకు అరవింద్ కేజ్రివాల్ ను కూడా కలుస్తారని టిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి అని పేర్కొన్నారు. అయితే ఈ భేటీ జరగలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక ఇదే సమయంలో ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి పై తాము పోరాటం చేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి చెబుతున్నారని కెసిఆర్ కు జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజ్ ఇది అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాదు సోమ్ నాథ్ భారతి చేసిన ట్వీట్ కూడా రేవంత్ రెడ్డి షేర్ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+