ఈసారి తెలంగాణాలో BRS గెలిస్తే KCR చేసేది ఇదే: రేవంత్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు!!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. వనపర్తి లో విజయభేరి సభలో పాల్గొన్న ఆయన కేసిఆర్ పైన, ఆయన కుటుంబం పైన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈసారి BRS గెలిస్తే కేసీఆర్, ఆ పార్టీ నేతలు వేల కోట్ల సంపాదనకు తెరలేపుతారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మన భవిష్యత్ నిర్ణయించుకునే అవకాశం వచ్చిందని అన్నారు. కాబట్టి ఈ సమయంలో ఓటర్లు మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ స్వేచ్ఛగా లేరని విమర్శించారు. మనవడిని మంత్రిని చేసేందుకే మూడోసారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Revanth Reddy sensation; This is what KCR will do if he wins in Telangana this time!!

అంతేకాదు వనపర్తి సభలో మంత్రి నిరంజన్ రెడ్డి పై మండిపడిన రేవంత్ రెడ్డి ఆయన నీళ్ల నిరంజన్ కాదు కమీషన్ల నిరంజన్ అని విరుచుకుపడ్డారు. ప్రజల సొమ్ము దోచుకుని వందల ఎకరాల్లో ఫాం హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. గుడి, బడి తేడా లేకుండా కబ్జా చేశారని నిరంజన్ రెడ్డి పై మండిపడ్డారు.

అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, అప్పటికి ఇప్పటికీ మారింది వాళ్ళ బ్రతుకులే గానీ, సామాన్యుల బ్రతుకులు కాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల బతుకులు ఎలా ఉన్నాయో ప్రజలు చూడాలన్నారు. పదేళ్ల అవకాశం ఇస్తే కెసిఆర్ ప్రజలకు చేసిందేమీ లేదని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం జరిగిందని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని మరి అలాంటి కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అంటూ ప్రశ్నించారు. బిఆర్ఎస్ కు మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని ఊహించలేమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+