టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం: గులాబీ పార్టీలో గుబులు!!
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఒకరకంగా నిరుద్యోగులకు, యువతకు బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరగడానికి, ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కూడా ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కారణమైంది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తూ ప్రక్షాళనకు అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ రేవంత్ రెడ్డి కేసు వివరాలు, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక తాజాగా ఆయన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజీ పై సీరియస్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ఆయన వెల్లడించారు.

పోటీ పరీక్షల నిర్వహణలో గతంలో జరిగిన వైఫల్యాలపై విచారణ చేయిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు .దీనికోసం జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో గతంలో రేవంత్ రెడ్డి అనేకమార్లు ఆరోపణలు చేశారు. సిట్ విచారణను కూడా ఎదుర్కొన్నారు.
మంత్రి పీఏగా పనిచేసిన వ్యక్తి లీకేజీ సూత్రధారి అని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖను కూడా రాశారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని అంత ఈజీగా వదిలిపెట్టేలా లేరని తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం.
ఇక రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ విషయంలో వేస్తున్న తాజా స్టెప్స్ తో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో నిజానిజాల నిగ్గు తేలుస్తారని చర్చ జరుగుతుంది. ఇది తిరిగి తిరిగి కేటీఆర్ మెడకు చుట్టుకుంటుందా అన్న ఆందోళన గులాబీ నేతల్లో వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications