లోకేష్‌ను కేంద్ర మంత్రిని చేయండి, తప్పటడుగులు వేశా: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కేంద్ర మంత్రిని చేయాలని తెలుగుదేశం శాసనసభా పక్ష నేత రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కోరారు.
గురువారం రాత్రి ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకేష్‌కు పార్టీ బాధ్యతలే కాకుండా అధికారిక బాధ్యతలు కూడా ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా తెలంగాణలో అధికారులకు ఆదేశాలిచ్చే పరిస్థితి లోకేష్‌కు ఉంటుందన్నారు.

రాజకీయాల్లో హోదా కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు. అలాగే తనకు అనుభవం తక్కువని, తప్పటడుగులు, తోట్రుపాట్లు ఉన్నాయన్నారు. వారంలో రెండు రోజులు చంద్రబాబునాయుడు తెలంగాణకు సమయం కేటాయించాలని ఆయన కోరారు. కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు.
చంద్రబాబు లేకపోవడంతో తప్పటడుగులు పడుతున్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. తమకు సమయం, అనుభవం కావాలని ఆయన అన్నారు. గ్రామస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీపై కార్యకర్తలు ఎంతో విశ్వాసంతో ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications