టార్గెట్ కేసీఆర్: దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి; బహుముఖ వ్యూహంతో బరిలోకి....తగ్గేదేలే!!

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని జరుగుతున్న ప్రచారంతో, ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు. ఇక రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుండే దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఒకపక్క అధికార టీఆర్ఎస్ పార్టీని, మరోపక్క బిజెపిని గందరగోళానికి గురి చేస్తూ రకరకాల ప్రకటనలు చేయడంతో పాటు, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో, ప్రత్యర్థి పార్టీల బలమైన నాయకులను కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి.

వచ్చే ఎన్నికలు టార్గెట్ గా ముందస్తు వ్యూహంతో రేవంత్ రెడ్డి

వచ్చే ఎన్నికలు టార్గెట్ గా ముందస్తు వ్యూహంతో రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో గెలుపు సాధించటం కోసం కొనసాగించాల్సిన వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని దూకుడు పెంచారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బరిలోకి దిగడం కోసం ఇప్పటికే జాబితాను సిద్ధం చేసుకున్నారు. మరోవైపు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పదవులను భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

పిసిసి ఉపాధ్యక్షులు,పార్టీ డీసీసీ అధ్యక్షులను మార్చనున్న రేవంత్ రెడ్డి

పిసిసి ఉపాధ్యక్షులు,పార్టీ డీసీసీ అధ్యక్షులను మార్చనున్న రేవంత్ రెడ్డి

పిసిసి ఉపాధ్యక్షులు, 36 మంది డిసిసి అధ్యక్షుల జాబితాను రెడీ చేసిన రేవంత్ రెడ్డి ఈమేరకు అధిష్టానానికి జాబితాను పంపించారు. అంతేకాదు ఐదుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను కూడా మార్చాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష ను చేపట్టిన రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇతర పార్టీల నుండి బలమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి పట్టు ఉన్న నియోజకవర్గాలలో, బలమైన నాయకత్వం ఉన్నచోట అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. తనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సీనియర్లను కట్టడి చేస్తూనే, వారి తీరుపై నిఘా పెడుతూనే రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు .

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 70 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటన

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 70 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటన

ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే 90 లక్షల ఓట్లు వచ్చి తీరుతాయని, 70 స్థానాలలో తాము గెలిచి తీరుతామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్నాయని ఒక్కో సభ్యుడు ఒక ఓటు వేసిన తమకు సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు పలు సంస్థలు చేసిన సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మూడు శాతం ఓటింగ్ పెరిగినట్లుగా రేవంత్ రెడ్డి వెల్లడించారు.

మొన్న రైతు డిక్లరేషన్, మళ్ళీ నిరుద్యోగ డిక్లరేషన్ .. రేవంత్ వ్యూహం

మొన్న రైతు డిక్లరేషన్, మళ్ళీ నిరుద్యోగ డిక్లరేషన్ .. రేవంత్ వ్యూహం


ఇప్పటికే రాష్ట్రానికి రాహుల్ గాంధీని తీసుకువచ్చి రైతు డిక్లరేషన్ ను వ్యూహాత్మకంగా ప్రకటింపచేసిన రేవంత్ రెడ్డి, త్వరలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటనకు రంగం సిద్ధం చేశారు. మరోమారు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి నిరుద్యోగ డిక్లరేషన్ ను ప్రకటింపచేసి, నిరుద్యోగుల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నం చేయనున్నారు. సీనియర్లు తనపై ఎంతగా దాడికి దిగినా, అవేవీ పట్టించుకోకుండా తనదైన శైలిలో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తూనే ఉన్నాడు.

ఇప్పటికే అభ్యర్థుల జాబితా అధిష్టానానికి

ఇప్పటికే అభ్యర్థుల జాబితా అధిష్టానానికి

రాజకీయ వ్యూహకర్త కనుగోలు సునీల్ నివేదికల మేరకు, బలమైన స్థానాల్లో అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసి, ఆ జాబితాను అధిష్ఠానానికి పంపించారు. ఇక బలహీనంగా ఉన్న స్థానాలలో, ఇతర పార్టీల నుండి బలమైన అభ్యర్థులు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. మొత్తానికి కెసిఆర్ సర్కారును గద్దె దించడం కోసం పట్టుదలతో ఉన్న రేవంత్ రెడ్డి, వచ్చే ఎన్నికల వ్యూహాలను ఇప్పటి నుంచే కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+