బాబుకు అన్నీ చెప్పేశా, ఇప్పుడే అసలు ఆట మొదలు: కేసీఆర్‌కు రేవంత్ హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును గద్దె దించడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

  MLA Revanth Reddy resignation issue ఆ సస్పెన్స్ కూడా బద్దలు కొట్టిన రేవంత్ | Oneindia Telugu

  రేవంత్‌ను ఆపండి: షా ఫోన్, బాబు ఆవేదన ఇలా, అన్నీ చెప్తా.. రేవంత్ సంచలనం

  రేవంత్ రెడ్డి ఆదివారం కార్యకర్తలు, అనుచరులతో భేటీ అయ్యారు. రేవంత్‍‌కు మద్దతుగా ఆయన నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసలైన ఆట ఇప్పుడు మొదలైందన్నారు.

  చంద్రబాబుకు అన్నీ చెప్పేశా, కేసీఆర్‌కే మేలు

  చంద్రబాబుకు అన్నీ చెప్పేశా, కేసీఆర్‌కే మేలు

  రాజకీయాల్లో ఉన్నంత వరకు కొడంగల్ నుంచే పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురి పాలనను అంతం చేసేందుకే తాను టీడీపీకి రాజీనామా చేశానని చెప్పారు. కొడంగల్ దొరల కోటలను కూల్చినట్లే రాష్ట్రంలో కేసీఆర్ కోటను కూల్చేస్తానని చెప్పారు. చంద్రబాబుతో అన్నీ మాట్లాడే రాజీనామా చేశానని చెప్పారు. పార్టీలు విడిపోయి పోరాడితే కేసీఆర్‌కు మేలు అని చెప్పారు.

  కొడంగల్ సేవకుడిగా అవకాశం కల్పించారు

  కొడంగల్ సేవకుడిగా అవకాశం కల్పించారు

  కొడంగల్ సేవకుడిగా తనకు అవకాశం కల్పించారన్నారు. తాను వ్యక్తిగత స్వార్థంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీరణకు సమయం ఆసన్నమైందని చెప్పారు.

  మద్దతు ధర అడిగితే బేడీలు వేస్తున్నారు

  మద్దతు ధర అడిగితే బేడీలు వేస్తున్నారు

  మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తెలంగాణలో దొరల పాలన అంతం కావాలన్నారు. తన అధిష్టానం ఎక్కడో లేదని కొడంగల్ కార్యకర్తలే అన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలకు మద్దతుగా, కేసీఆర్ కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు తాను రాజీనామా చేశానని చెప్పారు.

  మీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటా

  మీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటా

  కొడంగల్ కార్యకర్తలు ఇచ్చే నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటానని చెప్పారు. అందుకే అమరావతిలో ఉన్న చంద్రబాబును కలిసి తెలంగాణలో పార్టీ పరిస్థితులను చెప్పానని తెలిపారు. మిమ్మల్ని (కొడంగల్ కార్యకర్తలను) కలిశాకే నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

  ఆట మొదలైంది రేవంత్ రెడ్డి

  ఆట మొదలైంది రేవంత్ రెడ్డి

  ఇక తెలంగాణలో అసలైన ఆట మొదలైందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల కార్యకర్తల అభిప్రాయాన్ని రేపు జలవిహార్‌లో తీసుకుంటానని చెప్పారు. కొడంగల్ కార్యకర్తలను కలిసి అడిగినట్లే, 119 నియోజకవర్గాల్లోని కార్యకర్తల నుంచి అభిప్రాయం తీసుకుంటానని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana political leader Revanth Reddy on Sunday targeted Telangana Chief Minister K Chandrasekhar Rao in Kodangal meeting.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి