వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ పీసీసీ చీఫ్ ఖరారు..!! అనేక ట్విస్టుల నడుమ..నేడే అధికారిక ప్రకటన..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నూతన చీఫ్ ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రోజు ఏఐసీపీ అధికారికంగా టీపీసీసీ చీఫ్ ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నసమస్యల కారణంగా పేరు ప్రకటన ఆలస్యమైంది. కరోనా తీవ్రత తగ్గటంతో ఇతర రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీపీ..ఈ రోజు తెలంగాణ పీసీసీ ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ పదవి ఆశిస్తున్న పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేసి చివరి నిమిషం వరకు తమ వంతు ప్రయత్నాలు చేసారు.

Recommended Video

TPCC Chief: పక్కకు వెళ్లి మాట్లాడుకున్న Revanth Reddy - Komati Reddy పదవి ఎవరికి దక్కినా ?
 రేవంత్ కు పార్టీ పగ్గాలు..

రేవంత్ కు పార్టీ పగ్గాలు..

అయితే, ఏఐసీసీ మాత్రం టీఆర్ఎస్ పైన దూకుడుగా ఉంటూ ప్రజలతో మమేకం అయ్యే నేతనే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో సీనియర్లను..సామాజిక సమతుల్యతను పాటిస్తూ పదవులకు ఎంపిక చేసినట్లు సమాచారం. అందులో భాగంగా.. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. చివరి నిమిషం లో మార్పులు జరిగితే మినహా రేవంత్ కు పీసీసీ పీఠం ఖాయం. అదే సమయంలో పీసీసీలోనే కీలక పదవుల భర్తీ పైన నిర్ణయం జరిగినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా.. జీవన్‌రెడ్డి ని కార్యనిర్వహక అధ్యక్షుడిగా.. మధుయాష్కీని ప్రచార కమిటీ ఛైర్మన్లుగా నియమిస్తారని చెబుతున్నానరు. ఇక, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కు కీలక పదవి ఇస్తారని చెబుతున్నారు.

 సీనియర్లకు సమ ప్రాధాన్యం..

సీనియర్లకు సమ ప్రాధాన్యం..

అయితే, పీసీసీ చీఫ్ కోసం చివరి దాకా పోటీలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డికి మద్దతిస్తున్నారు. కోమటిరెడ్డికి ఏఐసీసీలో పదవి ఇవ్వాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే, చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా..ఈ పేర్లతో టీపీసీసీ లిస్టు కు సోనియా ఆమోద ముద్ర లాంఛనమే అని చెబుతున్నారు. ఢిల్లీలోనే మకాం వేసిన సీనియర్లు ఇప్పటి వరకు రెడ్డి వర్గానికి చెందిన నేత పీసీసీ చీఫ్ గా ఉండటంతో... బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అన్ని వర్గాలకు పీసీసీలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ...సారధ్య బాధ్యతలు అప్పగిస్తూ కూర్పు చేసినట్లుగా సమాచారం.

 టార్గెట్ కేసీఆర్ లక్ష్యంగా..

టార్గెట్ కేసీఆర్ లక్ష్యంగా..

టీఆర్ఎస్ నుండి బయటకు వస్తున్న నేతలు బీజేపీ వైపు వెళ్తున్నారని.. తెలంగాణలో బీజేపీ బలపడుతోందనే వాదనల నడుమ..కాంగ్రెస్ కు బలమైన నాయకుడికి సారధ్యం అప్పగించాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. అందులో భాగంగా... ప్రజలను తన ప్రసంగాలతో ఆకట్టుకొనే నైపుణ్యం..కేసీఆర్ లక్ష్యంగా పదునైన విమర్శలు..బీజేపీ పైన విరుచుకుపడే రేవంత్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన ఎంపికగా ఏఐసీసీ భావించి..ఆయన ఎంపిక వైపు మొగ్గు చూపినట్లుగా విశ్వసనీయ సమాచారం. చివరి నిమిషంలో టెన్ జన్ పథ్ లో ఈ నిర్ణయం పైన ఎటువంటి మార్పులు చోటు చేసుకోకుంటే..ఈ సాయంత్రం లోగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామక ఉత్తర్వులు వెలువడనున్నా

English summary
AICC may announce TPCC Chief name to day After huge consultations AICC decided Revanth reddy as TCPCC Chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X