రేవంత్ రెడ్డి అనే నేను.. సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి!!
తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. ఎల్బీ స్టేడియం మారుమోగిపోయింది. దశాబ్దకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎదురుచూస్తున్న కలలు ఫలించాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
తెలంగాణా రాష్ట్రమంతా ఎదురుచూసినట్టు రేవంత్ రెడ్డి సీఎంగా పట్టాభిషేకం జరిగిపోయింది. గవర్నర్ తమిళి సై ఆదేశాలతో సీఎస్ శాంతకుమారి ప్రకటించగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి అనే నేను భారత రాజ్యాంగం పట్ల అంటూ.. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తుంటే ఎల్ బి స్టేడియం మారుమోగింది.

"ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని,భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్త శుద్ధితో నిర్వహిస్తానని, భయం గానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అంటూ ప్రమాణం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జయజయ ధ్వానాలతో ఎల్బీ స్టేడియం ప్రాంగణం హోరెత్తింది. రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, ఏఐసిసి పెద్దలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు, మంత్రుల సమక్షంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారంతో మరో 11 మంది ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications