హీరోయిన్ల వద్దకు వెళ్తావు కానీ!: కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి అల్టిమేటం
సినిమా హీరోయిన్లను పరామర్శించే మంత్రి కేటీఆర్‌కు నేరెళ్ల బాధితులను పరామర్శించే టైమ్ లేదా అని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు.
సిరిసిల్ల: సినిమా హీరోయిన్లను పరామర్శించే మంత్రి కేటీఆర్‌కు నేరెళ్ల బాధితులను పరామర్శించే టైమ్ లేదా అని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు.
నేరెళ్లలో బాధితులను కొట్టే అధికారం ఎస్పీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇసుకతో రూ.1000 కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతున్నారని, మరి బాధిత కుటుంబాలకు ఎందుకు సాయం చేయరని ప్రశ్నించారు.

ఆగస్టు 15లోగా కేటీఆర్ బాధితులను పరామర్శించి, ఆదుకోకుంటే నేరెళ్లను ముట్టడించి, సంగతి తేలుస్తామని రేవంత్ హెచ్చరించారు. బంధువులకే ఇసుక కాంట్రాక్టులు, తన ఆరోపణలు తప్పయితే నాపై కేసు పెట్టాలని సవాల్ చేశారు.
బాధితులపై థర్డ్ డిగ్రీ ఎందుకు ఉపయోగించారని మరో టిడిపి నేత పెద్దిరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు రజాకార్ల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేరేళ్ల ఘటనపై సంజాయిషీ చెప్పుకోవాల్సింది పోయి, సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో అహంభావంతో మాట్లాడారన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications