'టీ' అసెంబ్లీలో ఒంటరైన రేవంత్: మాట్లాడే అవకాశం దక్కడం లేదా?
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా తెలంగాణలో టీడీపీ పూర్తిగా కుదేలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరుపున అసెంబ్లీలో గొంతు వినిపించాల్సిన బాధ్యతను ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం అసెంబ్లీలో నూతన పారిశ్రామిక విధానంపై చర్చ జరుగుతున్న వేళ, రేవంత్ రెడ్డికి చర్చలో పాల్గొనేందుకు మూడు నిమిషాలు మాత్రమే అవకాశం లభించింది. ఆ తర్వాత స్పీకర్ మధుసూదనాచారి రేవంత్ రెడ్డి మైక్ కట్ చేశారు.
మిగతా సభ్యులకు ఇవ్వాల్సి ఉందని, మీరు సబ్జెక్ట్‌పై మాట్లాడి ఇక కూర్చోవాలని ఆయన సూచించారు. ఈ సమయంలో రేవంత్ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి పెద్దగా అరవడం వినిపించినా రేవంత్ కేకలను పట్టించుకొని స్పీకర్ మరోకరు మాట్లాడాల్సిందిగా స్పీకర్ మరో సభ్యుడి పేరు పిలిచారు.

అయితే రేవంత్ రెడ్డి మాత్రం తనకిచ్చిన సమయంలోనే టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏయే పారిశ్రామికవేత్తకు ఎంత భూమి, ఎంత రేటుకు ఇచ్చారన్న విషయాన్ని సభ ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దళిత పారిశ్రామికవేత్తలకు కేటాయించిన నిదులు పక్కదారి పడుతున్నాయని రేవంత్ ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డితో సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్యలు మాత్రమే తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications