ప్రధాని-కేసీఆర్ మధ్య యూపీ ఎన్నికలలపై చర్చ: ఈటల బలి కాక తప్పదు-రాహుల్ ఏం చెప్పారంటే : రేవంత్..!!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన టీంతో ఏఐసీసీ నేత రాహుల్ సమావేశమయ్యారు. తెలంగాణ వ్యవహరాల ఇన్‌ఛార్జీ మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, గీతారెడ్డి తో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేయనున్నారు. వరంగల్‌లో నిర్వహించే దళిత, గిరిజన దండోరా సభకు రావాలని రాహుల్ గాంధీని టీపీసీసీ నేతలు కోరారు. ఈ నెల17వ తేదీన రాహుల్ పర్యటనకు రావాలని గతంలోనే కోరామని పార్టీ నేతలు చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని..అందరూ సమిష్టిగా పోరాడితే అధికారం ఖాయమని రాహుల్ సూచించారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితి..సామాజిక వర్గాల మద్దతు పైన ఆరా తీసారు. ఇదే సమయంలో ప్రతీ మూడు నెలలకు ఒక సారి తెలంగాణలో పర్యటించాల్సిందిగా రాహుల్ ను టీపీసీసీ నేత రేవంత్ కోరారు. సోనియా జన్మదినం సందర్బంగా డిసెంబర్ 9వ తేదీ నుంచి పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు.

ప్రధాని -కేసీఆర్ భేటీ వెనుక కారణం ఇదే
ఆ తరువాత రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రధానితో సమావేశమైన సమయంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల గురించి చర్చించారని...ఎంఐఎం ఎన్ని సీట్లలో పోటీ చేయాలో చర్చ చేసారని చెప్పుకొచ్చారు. అదే విధంగా కేసీఆర్ - బీజేపీ మిలాఖత్ లో బండి సంజయ్- ఈటల బలి కాక తప్పదని రేవంత్ వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబమే పెద్ద సమస్య అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయినట్లు కనబడుతున్నారని ఎద్దేవాచేశారు.
Recommended Video

ఈటల బలి అవుతారంటూ
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ, త్యాగాల ప్రతీక.. అమరవీరుల స్థూపం కానీ పార్టీ ఆఫీసులు కాదని రేవంత్‌రెడ్డి అన్నారు.ఇదే సమయంలో తెలంగాణలో తాము నిర్వహిస్తున్న దళిత-గిరిజన సమావేశాల గురించి రేవంత్ పార్టీ నేత రాహుల్ కు వివరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పైనా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పైనా రాహుల్ తో చర్చ జరిగిందని సమాచారం.












Click it and Unblock the Notifications