రేవంత్ వర్సెస్ గులాబీ నేతలు.!విసురుకుంటున్న విమర్శనాస్త్రాలు.!ఎవరిక లాభం..?ఎవరికి నష్టం..?
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా బహిరంగ సభను ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లిలో నిర్వహించారు. ఈ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించిన అంశాలు అధికార పార్టీ నేతలను ఆగ్రహానికి గురిచేసాయి. దాదాపు అరడజను పైగా గులాబీ అగ్ర నేతలు రేవంత్ రెడ్డిపై ఎదురుదాడికి ఉపక్రమించారు. తారా స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక దశలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై అనుచిత వాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తాం లాంటి హెచ్చరికలు కూడా పంపించారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్క సారిగా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా మారిపోయాయి.

రాజకీయ రచ్చ.. చిచ్చుపెట్టిన ఇంద్రవెల్లి సభ
రేవంత్ రెడ్డి ఇంద్రవల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మీద కొత్తగా చేసిన ఆరోపణలు ఏమీ లేనప్పటికి గులాబీ నేతల మనోభావాలు ఒక్కసారిగా దెబ్బతిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రిని జైలుకు పంపిస్తామనడంతో పాటు కొంత మంది మంత్రులను, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ను రేవంత్ రెడ్డి గాటుగా విమర్శించారు. మంత్రి జోగు రామన్నను జోకుడు రామన్నగా, బాల్క సుమన్ ను బానిస సుమన్ గా, గుడిని గుడిలో లింగాన్ని మింగేసే మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డిని అభివర్ణించారు రేవంత్ రెడ్డి. దీంతో గులాబీ నేతలు ఒక్క సారిగా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ పై ఎదురుదాడి.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతున్న గులాబీ నేతలు..
సాదారణంగా రాజకీయ బహిరంగ సభల్లో ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేయడం, రాజకీయ ఆరోపణలు గుప్పించడం సహజం. ఒకానొక దశలో ఆరోపణలు హద్దులు దాటి అనుచిత వ్యాఖ్యల వరకూ దారి తీస్తాయి. ప్రత్యర్థి పార్టీ నేతల మనోభావాలు ఇక్కడే దెబ్బతింటాయి. గులాబీ నేతలు ఇదే అంశంలో రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, సైది రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గువ్వల బాలరాజు, భాస్కర రావు లాంటి నేతలు రేవంత్ వాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేసారు. అంతే కాకుండా గట్టి హెచ్చరికలు కూడా పంపే ప్రయత్నం చేసారు.

డోస్ పెంచిన రేవంత్ రెడ్డి.. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ మంత్రులు..
ఏదేమైనా ఇంద్రవల్లి సభతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వం మీద నిరసన తెలపడం కాంగ్రెస్ పార్టీకి చేతకావడం లేదని, అసలు సబ్జెక్టు ఎంపిక విధానంలోను విఫలం చెందుతున్నారని గతంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేసారు. కాని ఇప్పుడు పరిస్థితిలో మార్పు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గాని, మంత్రులను గానీ విమర్శిస్తే చాలా తేలిగ్గా తీసుకునే వారు. కౌంటర్ ఇవ్వడానికి కూడా పెద్దగా ప్రయత్నించేవారు కాదు. కాని ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసిసి ఛీఫ్ హోదాలో చేస్తున్న వ్యాఖ్యల పట్ల మాత్రం తారాస్థాయిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు.
Recommended Video

రాజకీయ యుద్ద వాతావరణం.. ప్రజా తీర్పే కీలకం..
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుండి రాష్ట్ర రాజకీయాల్లో వేడిమొదలైందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి ప్రసంగాలను ప్రజలు ఆదరిస్తున్న విధానం, ప్రభుత్వ విధానాలపై రేవంత్ స్పందనను ప్రజలు ఆహ్వానిస్తున్న వైఖరి అధికార పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అటు రేవంత్ రెడ్డి అధికార పార్టీ మీద చేస్తున్న ఆరోపణలను, అధికారపార్టీ నేతలు రేవంత్ పై చేస్తున్న ప్రత్యారోపణలను ప్రజలు చాలా సునిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించిన దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు వీలుకాకపోతే ప్రజల తీర్పు ప్రభుత్వానికి శరాఘాతంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ కూడా లాభపడే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications