Medak: భూమి ఇస్తావా.. రూ. 2 లక్షలు ఇస్తావా.. చివరికి ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారి..
రైతు వద్ద లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కాడు.
లక్షల్లో జీతాలు ఉన్నా కొంత మంది రెవెన్యూ ఉద్యోగుల తీరు మారడం లేదు. లంచాలకు అలవాటుపడిన వారు డబ్బు చేతిలో పెట్టకుంటే పని చేయరని ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యం ఆరుగాలం కష్టపడి జీవింతే రైతుల దగ్గర కూడా చేతులు చాస్తూ ప్రజల ముందు దోషులుగా నిలిస్తున్నారు. తాజాగా ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ ఓ ఆర్ఐ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో జరిగింది.

22 గుంటల సాగు భూమి
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని సంగాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు సర్వేనెంబర్ 1313లో 22 గుంటల సాగు భూమి ఉంది.అయితే ఆ కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం కొత్త పాసు బుక్ లు ఇచ్చింది. పాత పట్టాదారు పాసు పుస్తకంలో ఆ భూమి వివరాలు ఉన్నప్పటికీ, కొత్త పుస్తకంలో 22 గుంటల భూమి ఎక్కలేదు. దీంతో శ్రీనివాస్ రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లలరిగేలా తిరిగాడు. చివరికి ఆర్ఐ శ్రీహరిని సంప్రదించాడు.

రెండు లక్షల రూపాయలు
రెండు లక్షల రూపాయలు ఇస్తే కొత్త పాస్ బుక్ లో 23 గుంటల భూమి ఎక్కిస్తాన్ని శ్రీహరి చెప్పాడు. అంత డబ్బులు ఇచ్చుకోలేనని రైతు శ్రీనివాస్‌వాపోయాడు. "నీ వద్ద డబ్బు లేకుంటే.. నీ పొలం పక్కనే నాకు కొంత భూమి ఉందని.. రూ.2 లక్షలకు బదులుగా 18 గజాల జాగా ఇవ్వాలని" శ్రీహరి డిమాండ్ చేశాడు. తనకు ఉన్నదే 22 గుంటలు అని అందులో మీకు 18 గజాలు ఇస్తే తానకేం మిగులుతుందని శ్రీనివాస్ దీనంగా అడిగాడు.

రూ.1 లక్షకు ఒప్పందం
చివరకి రూ.1 లక్షకు ఒప్పందం చేసుకున్నాడు. భూమి వివరాలను పాసుపుస్తకంలో నమోదు చేశాకే డబ్బులు ఇవ్వాలన్నాడు. పొలాన్ని పట్టాదారు పాసు పుస్తకంలో పొందుపరిచారు. చందంపేట గ్రామ వీఆర్‌ఏ సురేష్‌బాబును మధ్యవర్తిగా ఉంచి, లంచం డబ్బు కోసం శ్రీనివాస్‌పై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. బాధితుడు శ్రీనివాస్ జనవరి 5న ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ను కలిసి జరిగింది వివరించాడు.

బైక్‌పై పారిపోతుండగా
ఏసీబీ అధికారులు చెప్పిన ప్రకారం రైతు శ్రీనివాస్ సోమవారం రుద్రారం గ్రామ శివారులో ఆర్‌ఐ, వీఆర్‌ఏలకు డబ్బులు ఇచ్చాడు. ఏసీబీ అధికారులను చూసిన ఆర్‌ఐ, వీఆర్‌ఏ బైక్‌పై పారిపోతుండగా ఏసీబీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. వారిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీహరి, వీఆర్‌ఏ సురేశ్‌బాబులపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ వెల్లడించాడు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications