ఆత్మహత్య?: తుపాకీ పేలి బాధ్యతలు తీసుకున్న 2రోజులకే ఎస్ఐ మృతి
ఆదిలాబాద్: జిల్లాలోని కెరమెరిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో కెరమెరి ఎస్ఐ కె శ్రీధర్(27) మృతి చెందాడు. కాగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా? లేదా శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అంశం ఇంకా తేలలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రెండు రోజుల క్రితమే శ్రీధర్ కెరమెరి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టాడు. ఆయన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. మూడు నెలల నుంచి కెరమెరిలో ట్రైనీ ఎస్ఐగా ఆయన పనిచేశాడు.
ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. కాగా, సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.












Click it and Unblock the Notifications