• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి మల్లారెడ్డి : విజయశాంతి సంచలనం; బీజేపీకి ఆయుధంగా మారిన రచ్చ !!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, మల్లారెడ్డికి మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది. మోతాదు పెంచి తిట్టుకుంటున్న నేతల తీరు ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది. ఇక ఇదే సమయంలో బీజేపీకి ఇది ప్రస్తుతం ఆయుధంగా మారింది. అటు టిఆర్ఎస్ పార్టీని, ఇటు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న పరిణామాలు, నివ్వెర పోయేలా తిట్టుకుంటున్న తిట్లు అవకాశం కల్పించాయి.

కేసీఆర్ ప్రగతి, సాధికారతల పాట అందుకే.. అన్నీ ప్రగల్భాలే, నేను చెప్పిందే నిజమన్న విజయశాంతికేసీఆర్ ప్రగతి, సాధికారతల పాట అందుకే.. అన్నీ ప్రగల్భాలే, నేను చెప్పిందే నిజమన్న విజయశాంతి

రేవంత్ రెడ్డి వర్సెస్ మరేవంత్ రెడ్డి వర్సెస్ మల్లారెడ్డి.. తొడగొట్టి మరీ సవాళ్ళ పర్వంల్లారెడ్డి.. తొడగొట్టి మరీ సవాళ్ళ పర్వం

రేవంత్ రెడ్డి వర్సెస్ మరేవంత్ రెడ్డి వర్సెస్ మల్లారెడ్డి.. తొడగొట్టి మరీ సవాళ్ళ పర్వంల్లారెడ్డి.. తొడగొట్టి మరీ సవాళ్ళ పర్వం

రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి మల్లారెడ్డి మధ్య సవాళ్ళ యుద్ధం రాజకీయంగా పీక్స్ కి చేరుకుంది. సీఎం కేసీఆర్ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుక కోస్తామని కొందరు, నోరు అదుపులో పెట్టుకోమని మరికొందరు, రాజీనామా చేసి నా మీద పోటీ చెయ్ అంటూ ఇంకొందరు రేవంత్ రెడ్డి కి సవాళ్ళు విసురుతున్నారు. ఇక దళిత గిరిజన దండోరా సభలో మల్లారెడ్డి అవినీతి మీద రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి రెచ్చిపోయి విరుచుకుపడ్డారు. ఏకంగా మంత్రి మల్లారెడ్డి నోటికొచ్చినట్టు రేవంత్ రెడ్డిని తిట్టిపోశారు. తొడగొట్టి మరీ సవాల్ చేశారు. దమ్ముంటే రా రా, నీకు ఈ రోజు సాయంత్రం వరకు టైం ఇస్తున్నా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు అంటూ రేవంత్ రెడ్డికి చాలెంజ్ చేశారు.

రేవంత్ రెడ్డి మల్లారెడ్డిల రచ్చ పై రాములమ్మ సెటైర్లు

రేవంత్ రెడ్డి మల్లారెడ్డిల రచ్చ పై రాములమ్మ సెటైర్లు

పరుష పదజాలంతో కార్మిక శాఖ మంత్రి మాట్లాడిన భాష రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. మంత్రి మల్లారెడ్డి సగం బ్రోకర్, సగం జోకర్ అంటూ రేవంత్ రెడ్డి సైతం, ఏ మాత్రం తగ్గకుండా ఘాటుగా నే రివర్స్ సమాధానమిచ్చారు. ఇక మంత్రి మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి ల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం పై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. తెలంగాణా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నిత్యం టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసే విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మల్కాజ్ గిరి, మేడ్చల్ ప్రజలు ఎదురు చూస్తున్నారన్న విజయశాంతి

మల్కాజ్ గిరి, మేడ్చల్ ప్రజలు ఎదురు చూస్తున్నారన్న విజయశాంతి

అటు తెలంగాణలో దూకుడు పెంచుతున్న కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని ఏకకాలంలో టార్గెట్ చేస్తున్నారు విజయశాంతి. వారు మాట్లాడుకుంటున్న అసభ్య భాషపై వ్యంగ్యంగా స్పందించిన విజయశాంతి ప్రజలను తన వ్యాఖ్యలతో ఆలోచించేలా చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్ మంత్రిగారికి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు గురించి మల్కాజ్గిరి పార్లమెంటుతోపాటు మేడ్చల్ అసెంబ్లీ ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అంటూ విజయశాంతి ఆసక్తికర పోస్ట్ చేశారు. వారు మాట్లాడిన భాష, ఉపయోగించిన పదజాలం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నదో అన్న చర్చ ఒకటైతే ఇంకో చర్చ కూడా సాగుతుందని అన్నారు.

ప్రజల్లో వారు రాజీనామా చేస్తే వరాలు ఇస్తారేమో అన్న ఆశాభావం

ప్రజల్లో వారు రాజీనామా చేస్తే వరాలు ఇస్తారేమో అన్న ఆశాభావం

వారు సవాళ్ళు చేసుకున్నట్టుగా రాజీనామాలు జరిగి ఉప ఎన్నికలు వస్తే తమకు ఈ టిఆర్ఎస్ ముఖ్యమంత్రి ఏదో వరాలు అవసరార్ధం తప్పనిసరై ఇవ్వొచ్చునేమో అన్న ఆశాభావంతో ప్రజలు ఉన్నట్లుగా తెలుస్తుందని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలకు వెళుతున్న సమయంలో కెసిఆర్ హుజరాబాద్ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపిస్తున్నారు అని నర్మగర్భంగా వ్యాఖ్యానించిన విజయశాంతి, వారిద్దరి గొడవ మాట అటుంచితే, వారి రాజీనామాల కోసం జనం ఎదురు చూస్తున్నారు అంటూ పేర్కొన్నారు.

ఎన్నికలు లేకుంటే సీఎం కేసీఆర్ ఎవరినీ పట్టించుకోరు

ఎన్నికలు లేకుంటే సీఎం కేసీఆర్ ఎవరినీ పట్టించుకోరు

ఇదే సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ను టార్గెట్ చేసిన విజయశాంతి ఎన్నికల అవసరం లేకుంటే కెసిఆర్ గారు ప్రజల ముఖం కూడా చూడరు అన్న బలమైన నమ్మకం తెలంగాణ సమాజంలో ఏర్పడి ఉండడం ఇందుకు కారణం కావచ్చు అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరిగితే మాత్రమే సీఎం కెసిఆర్ దృష్టి ప్రజలపై పడుతుందని విజయశాంతి వ్యంగ్యంగా మాట్లాడారు. తెలంగాణలో ప్రజా ప్రతినిధుల రాజీనామాలకు అనేక నియోజకవర్గాలలో ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి అని విజయశాంతి పేర్కొన్నారు.

 తెలంగాణాను ఇంకెంత నవ్వుల పాలు చేస్తారో ఈ సీఎం గారు

తెలంగాణాను ఇంకెంత నవ్వుల పాలు చేస్తారో ఈ సీఎం గారు

రాజీనామాల కోసం, ఉప ఎన్నికల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితులకు ప్రజలను సీఎం కేసీఆర్ తీసుకువెళ్లారని ధ్వజమెత్తారు. ఈ అప్పులు, ఆస్తుల అమ్మకాల సీఎం గారు భవిష్యత్తులో తెలంగాణాను ఇంకా ఎంతగా నవ్వులపాలు చేస్తారో అన్న ఆందోళన అందరిలోనూ కలుగుతుంది అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. అంతే కాదు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై, సీఎం కేసీఆర్ తీరుపై, స్కూల్స్ తెరవాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఆమె తనదైన స్టైల్ లో వ్యాఖ్యలు చేశారు. అడుగడుగుగా సీఎం కేసీఆర్ తీరును తూర్పార బడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని పదే పదే చెప్తున్నారు బీజేపీ నాయకురాలు విజయశాంతి.

Recommended Video

దళిత గిరిజన దీక్షలో గర్జించిన రేవంత్ రెడ్డి..!! || Oneindia Telugu
అటు టీఆర్ఎస్ , ఇటు కాంగ్రెస్ ను తూర్పారబడుతూ టార్గెట్ చేస్తున్న విజయశాంతి

అటు టీఆర్ఎస్ , ఇటు కాంగ్రెస్ ను తూర్పారబడుతూ టార్గెట్ చేస్తున్న విజయశాంతి

మొత్తానికి తాజాగా టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి, మంత్రి మల్లారెడ్డికి మధ్య చోటు చేసుకున్న రాజకీయ రగడతో కాంగ్రెస్ పార్టీని, ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ రాములమ్మ సెటైర్లు వేస్తున్నారు. మరోమారు రాజీనామాల ప్రస్తావన తెచ్చి హుజురాబాద్ లో రాజీనామా జరిగితేనే సీఎం కేసీఆర్ దృష్టి సారించారని ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలు రాజీనామాల కోసం ఎదురు చూస్తున్నారని ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి, అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజీనామాల కోసం ప్రజలు ఆశాభావంతో ఉన్నారని చెప్తున్నారు.

English summary
words war between TPCC chief Revanth Reddy and Telangana minister Mallareddy has now become a hot topic in the state of Telangana.it has now become a weapon for the BJP. Vijayashanti targeted TRS party and the Congress party with this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X