జూబ్లీహిల్స్ లో ఆ పార్టీకి బిగ్ షాక్- ఎన్నికల సర్వే నిపుణుడి షాకింగ్

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ ఈ సాయంత్రం ముగిసింది. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఎన్నిక ఇది. మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష పెట్టింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ.. ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. దీన్ని హస్తగతం చేసుకోవడానికి పోటీ పడ్డాయి. దీన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్, హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్, పాగా వేయడానికి బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి.

బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. సిట్టింగ్ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ముగ్గురిలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతోన్నారనేది శుక్రవారం మధ్యాహ్నానికి తేలిపోనుంది. మొత్తం నాలుగు లక్షలమందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Rise Praveen Pullata Predictions on Jubilee Hills Assembly Bypoll

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రముఖ సర్వే సంస్థ రైజ్.. తన అంచనాలను వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ అధినేత, ఎన్నికల సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట విడుదల చేశారు. ఆయన అంచనాల ప్రకారం.. ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యత సాధించబోతోంది. ఈ నియోజకవర్గాన్ని గెలుచుకోబోతోంది. ఏ విధంగా చూసినా కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉంది. మెజారిటీ డివిజన్లల్లో హస్తం హవా వీస్తుంది.

  • షేక్ పేట్, షేక్ పేట్ నాలాల్లో కాంగ్రెస్ కొంత వరకు వెనుకంజ వేసే అవకాశం ఉందని ప్రవీణ్ పుల్లట తెలిపారు. హైడ్రా కూల్చివేతల ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు.
  • మైనారిటీ ఓటు బ్యాంక్ అధికంగా ఉండే బోరబండలో కాంగ్రెస్ కు క్లియర్ మెజారిటీ లభిస్తుంది. మహ్మద్ అజరుద్దీన్ కు మంత్రివర్గంలోకి తీసుకోవడం ప్లస్ పాయింట్. చాలా డివిజన్లల్లో మైనారిటీ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ ఓట్లను కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరిసగం పంచుకోనున్నాయి.
  • ప్రేమ్ నగర్, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డి గూడ, కల్యాణ్ నగర్, మోతీ నగర్ డివిజన్లల్లో కాంగ్రెస్ కు ఆధిక్యత లభించవచ్చు. యాదవుల ఓట్లల్లో కూడా ఎటువంటి చీలిక లేదని, వారంతా కాంగ్రెస్ కే మొగ్గు చూపించి ఉండొచ్చు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+