దినకరన్ విక్టరీ: రాములమ్మ విజయశాంతి పాత్ర పెద్దదే...

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ విజయంపై కొత్త విషయం వెలుగు చూసింది. తెలంగాణ రాములమ్మ విజయశాంతి ఆయన విజయం సాధించడంలో పెద్ద పాత్రనే పోషించారు.

చాలా కాలం చెన్నైలో ఉండి, సినిమా హీరోయిన్‌గా ప్రఖ్యాతి సాధించిన విజయశాంతి అమ్మ జయలలితకు వీరాభిమాని. ఆ తర్వాత ఆమె శశికళకు మద్దతు ప్రకటించారు కూడా. శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కూడా ఆమె ఆకాంక్షించారు.

అప్పుడు కూడా విజయశాంతి...

అప్పుడు కూడా విజయశాంతి...

ఆర్కే నగర్‌లో దినకరన్ తరఫున విజయశాంతి విస్తృత ప్రచారం చేశారు. తొలిసారి కూడా ఆమె అక్కడే ఉండి దినకరన్ తరఫున ప్రచారం చేశారు. ఆర్కేనగర్‌లో దాదాపు లక్ష మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. అందుకే ఆమె దినకరన్ విజయం కోసం నడుం బిగించారని అంటున్నారు.

  'జయ వారసుడ్ని' పై సుబ్రహ్మణ్యస్వామి ఎద్దేవా !
  విజయశాంతి ఇలా అన్నారు.

  విజయశాంతి ఇలా అన్నారు.


  ఉప ఎన్నిక వాయిదా పడిన తర్వాత కూడా విజయశాంతి అక్కడే ఉండి ప్రచారం చేశారు. ఓ తెలుగు టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ప్రచార వాహనం మీది నుంచే ఆమె టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. ఎన్నిక వాయిదా పడడానికి బిజెపి కుట్రనే కారణమని ఆమె నిందించారు.

  విజయశాంతి అప్పుడిలా..

  విజయశాంతి అప్పుడిలా..

  శశికళ జెలుకు వెళ్లక ముందు విజయశాంతి చెన్నై వెళ్లారు. మెరీనా బీచ్‌లో జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత పోయెస్ గార్డెన్‌కు వెల్ల శశికళకు మద్దతు ప్రకటించారు. శశికళ అనుచరుడిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి బలపరీక్షలో పళనిస్వామి నెగ్గిన తర్వాత శశికళకు అభినందలు తెలిపారు.

  విజయశాంతిపై ఆయన ఇలా...

  విజయశాంతిపై ఆయన ఇలా...


  శశికళకు మద్దతుఇస్తూ సందడి చేసిన విజయశాంతిపై తమిళ సంగీత దర్శకుడు జేమ్స్‌ వసంతన్‌ మండిపడ్డారు. నువ్వు రాజకీయ దిగ్గజం అనుకుంటున్నావా? నీ అభిప్రాయాలు మీ రాష్ట్రంలో చెప్పుకో. ఇది సినిమా కాదు. ఇవి తమిళ ప్రజల జీవితాలు' అని అన్నారు. మొత్తంమీద, విజయశాంతి ప్రచారం కూడా దినకరన్‌కు కలిసి వచ్చిందని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana Ramulamma and congress leader ijayashanthi has played a main role in TTV Dinakaran Victory in RK Nagar of Tamil Nadu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి