ఘోర ప్రమాదం: ఆటో-ఆర్టీసీ బస్సు ఢీ, ఐదుగురు మహిళల మృతి
ఆదిలాబాద్: జిల్లాలోని బెజ్జూరు మండలం సులుగుపల్లి వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో- ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
బెజ్జూరు నుంచి పెంచికల పేట వెళ్తున్న ఆటో, కాగజ్‌నగర్ నుంచి బెజ్జూరు వెళ్తున్న ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సులుగుపల్లి వద్ద ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.

సిర్పూర్(టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ పరారీ అయినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హాస్టల్లో విద్యార్థుల మృతి
ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం హాస్టల్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి వస్తోందని విద్యార్థులు చెప్పడంతో హాస్టల్ సిబ్బంది వారిని భద్రాచలం, ఖమ్మం ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మరో నలుగురు విద్యార్థులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications