వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు!!

|
Google Oneindia TeluguNews

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు నుండి వరంగల్ కు వెళ్తున్న ఒక కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టటంతో కారులో ప్రయాణం చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రోజు తెల్లవారు జామున వర్ధన్నపేట శివారు డీసీ తండా వద్ద జరిగిన ఈ దుర్ఘటనతో జాతీయ రహదారి రక్తమోడింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

వరంగల్ జిల్లా వర్ధన్నపేట శివారు డీసీ తండా వద్ద ఈ రోజు తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున వేగంగా వరంగల్ వైపు వస్తున్న కారు ఆగి ఉన్న లారీని మంచు కారణంగా గమనించలేదు. దీంతో ఘోర ప్రమాదం జరిగింది. కారును వేగంగా ఆగి ఉన్న లారీని ఢీ కొట్టటంతో కారులో ప్రయాణించే వారు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు నుండి వరంగల్ కు వస్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో తొమ్మిది మండి ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిని వరంగల్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

భార్యా, భర్తా కొడుకు స్పాట్ లో మృతి, గాయపడిన ఆరుగురు ఎంజీఎం ఆస్పత్రిలో

భార్యా, భర్తా కొడుకు స్పాట్ లో మృతి, గాయపడిన ఆరుగురు ఎంజీఎం ఆస్పత్రిలో


ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రజలు పెరుకవాడకు చెందిన బిల్డర్ కృష్ణారెడ్డి, ఆయన భార్య వరలక్ష్మి, కొడుకు వెంకట సాయి గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన మిగితా ఆరుగురిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించటంతో వరంగల్ పెరుకవాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చలికాలం ఉదయం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త

చలికాలం ఉదయం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త


ఇక చలి కాలం కావటంతో ఉదయం దట్టమైన పొగమంచు ఉంటుంది. అందుకే ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఈరోజు తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదం రోడ్డు కనిపించక పోవటం, విపరీతమైన వేగం కారణంగా జరిగినట్టు భావిస్తున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండకుంటే విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఎంతగా చెబుతున్నా వాహనచోదకుల నిర్లక్ష్యం ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఎన్నో కుటుంబాలు కోలుకోలేని తీరని శోకంలో మునిగిపోతున్నాయి. అందుకే రోడ్డు ప్రమాదాల నియంత్రణ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తిస్తే, కొంత మేరకు ప్రమాదాలను నివారించే వీలుంటుంది.

అతి తక్కువ ఖర్చుతో రెడీమేడ్ ఇల్లు.. ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.. ఓ లుక్కెయ్యండి!!అతి తక్కువ ఖర్చుతో రెడీమేడ్ ఇల్లు.. ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.. ఓ లుక్కెయ్యండి!!

English summary
A serious road accident took place in Warangal district. A car traveling from Ongole to Warangal hit a parked lorry, died three people on the spot. Six were seriously injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X