Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరంగల్ లో దోపిడీ దొంగల బీభత్సం.. నగల కోసం వృద్ధురాలి దారుణ హత్య

వరంగల్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగల కోసం వృద్ధురాలిని దారుణంగా హతమార్చారు.

వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించి ఒక వృద్ధ మహిళను హతమార్చిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే..

నగల కోసం వృద్ధురాలిని హతమార్చిన దోపిడీ దొంగలు

నగల కోసం వృద్ధురాలిని హతమార్చిన దోపిడీ దొంగలు

వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలోని సుందరయ్య నగర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్దరాత్రి 70 ఏళ్ల జాగిలాపు ఐలమ్మ అనే వృద్ధురాలు నిన్న రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి దోపిడీకి యత్నించారు. వృద్ధురాలి ఒంటిపైన ఉన్న నగలను చోరీ చేయడానికి దోపిడీ దొంగలు ప్రయత్నించారు. దీంతో వృద్ధురాలు ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన వృద్ధురాలు మృతి చెందింది. ఆపై నగలను దోచుకెళ్లారు దుండగులు. తెల్లవారుజామున లేచి చూసేసరికి వృద్ధురాలు మరణించి ఉండడంతో, ఈ ఘటనపై బంధువులు, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వరంగల్ సీపీ రంగనాథ్

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వరంగల్ సీపీ రంగనాథ్

దోపిడీ దొంగల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన వృద్ధురాలి కేసులో సంఘటన స్థలాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా నేరం జరిగిన తీరును పోలీస్ కమిషనర్సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలనుఏర్పాటు చేయడంతో పాటు నిందితులను త్వరితగతిన పట్టుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

దొంగల బీభత్సంతో భయాందోళనలో స్థానికులు

దొంగల బీభత్సంతో భయాందోళనలో స్థానికులు


నేర స్థలాన్ని పరిశీలించిన వారిలో ఈస్ట్ జోన్ డీసీపీ పి. కరుణాకర్, క్రైమ్ డీసీపీ మురళీధర్, పరకాల ఏసీపీ శివరామయ్య, ఎనుమాముల ఇన్స్ స్పెక్టర్ చేరాలు,సిసిఎస్ ఇన్స్ స్పెక్టర్ రమేష్తో పాటు క్లూస్ విభాగం అధికారులు,సిబ్బంది వున్నారు. అయితే ఇది దోపిడీ దొంగల పనేనా? లేకా వృద్ధురాలి గురించి తెలిసిన వారు ఎవరైనా చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఇంట్లోకి చొరబడి మహిళను తీవ్రంగా గాయపరిచి చోరీకి పాల్పడిన వార్తతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+