రోహిత్ ఆత్మహత్య: దత్తాత్రేయ స్మృతి ఇరానీకి రాసిన లేఖ ఇదేనా?

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై కేంద్ర మంత్రి, బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. దత్తాత్రేయపై కేసు కూడా నమోదైంది. రోహిత్ ఆత్మహత్యకు దత్తాత్రేయ కారణమంటూ దళిత విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు

సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ ప్రకారం - కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి బండారు దత్తాత్రేయ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు సంబంధించి ఓ లేఖ రాశారని అంటున్నారు. దానివల్లనే ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారని, వారిలో రోహిత్ కూడా ఉన్నాడని అంటున్నారు.

 Rohit suicide: The letter from Bandaru Dattatreya

ఆ ఐదుగురు విద్యార్థులకు వ్యతిరేకంగా ప్రోక్టర్ నివేదిక ఏ విధమైన నిర్ధారణలు కూడా చేయలేదనే మాట వినిపిస్తోంది. సుశీల్ కుమార్ అనే ఎబివిపి విద్యార్థిని కొట్టినట్లు ఏ విధమైన దాఖలాలు లేవని ఆ నివేదిక తెలియజేస్తున్నట్లు చెబుతున్నారు. కృష్ణ చైతన్య లేదా అనుపమ సమర్పించిన నివేదికలో కూడా ఆ విషయం లేదని అంటున్నారు.

దళిత విద్యార్థులు కొట్టడం వల్లనే సుశీల్ కుమార్‌కు శస్త్ర చికిత్స జరిగిందని చెప్పలేమని అనుపమ తన నివేదికలో చెప్పినట్లు ప్రోక్టర్ నివేదిక స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. రోహిత్ ఆత్మహత్యపై విచారణకు ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ లేఖతో పాటు ఓ వార్తాకథనం సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+