నిజమా.. నువ్వేనా :చిరంజీవిని సర్‌ప్రైజ్ చేసిన రోజా, అందరికీ షాక్!
ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి ప్రముఖ సినీ నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా సర్ ప్రైజ్ ఇచ్చారు.
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి ప్రముఖ సినీ నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా సర్ ప్రైజ్ ఇచ్చారు. చిరంజీవి తన ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఆయన వరుసగా ఛానళ్లకు ఇంటర్వ్యూలో ఇస్తున్నారు.
ఇందులో భాగంగా సాక్షి టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇంటర్వ్యూ షూట్ కోసం అంతా సెట్ చేసిన అనంతరం మేడ పైనుంచి చిరంజీవి కిందికి దిగారు. కిందకు వచ్చిన చిరంజీవి.. తనను ఇంటర్వ్యూ చేసేది ఎవరు అని అడిగారు.
అంతలోనే రోజా అక్కడకు వచ్చారు. తానే ఇంటర్వ్యూ చేస్తానని చెప్పారు. దీంతో చిరంజీవి ఆశ్చర్యపోయారు. నిజమా, నువ్వేనా అని చిరంజీవి ఆశ్చర్యపోయారు. సర్ ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చానని రోజా చెప్పారు. అనంతరం చిరంజీవి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రోజా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

ఇంటర్వ్యూ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఏర్పడిన స్తబ్ధత తాను సినీ రంగపునఃప్రవేశం చేసేందుకు ఉపయోగపడిందన్నారు. అభిమానుల కోరిక మేరకు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానని ఆయన చెప్పారు.
ఓ సందర్భంలో రోజా మాట్లాడుతూ.. మీ ఇంట్లో అందరూ హీరోలైపోయారని, ప్రధానంగా బంగారు కోడిపెట్ట పాటను రామ్ చరణ్ గారు చేస్తున్నప్పుడు మీరెలా ఫీలయ్యారని చిరంజీవిని ప్రశ్నించారు.
చిరంజీవి వెంటనే అందుకొని.. 'రోజా! ఊరుకో, వాడిని గారు అంటావేంటి? 'పిల్లాడిగా ఉన్నప్పుడు వాడిని ఎత్తుకున్నావు, చరణ్ అను చాలు' అని చెప్పారు. తన బంగారు కోడిపెట్ట పాటను వాడు రీమేక్ చేసినప్పుడు ఆందోళన చెందినా, అద్భుతంగా చేశాడని, దానిని చూసిన తర్వాత చాలా గర్వపడ్డానన్నారు.
కాగా, రాజకీయాల్లో చిరంజీవి పైన రోజా చాలాసార్లు తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీని మూసివేయడం పైనా మాట్లాడారు. ఇప్పుడు అదే రోజా.. చిరంజీవిని ఇంటర్వ్యూ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేశారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications