కర్ణాటకలో చోరీ చేసిన కోటి 50 లక్షలు: సూర్యాపేటలో ప్రత్యక్షం, స్వాధీనం
హైదరాబాద్: ఒక రాష్ట్రంలో దొంగిలించిన డబ్బు, రెండు రోజుల్లో మరో రాష్ట్రంలో దొరికింది. కర్ణాటకలోని బీజాపూర్ ఐసీఐసీఐ బ్యాంకులో దొంగిలించిన రూ. కోటి 50 లక్షలను నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్‌బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు వదలివెళ్లారు. దీనిని గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ అబ్దుల్ రషీద్ వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నాటకకు చెందిన కెఎ 28ఎన్ 9119 నెంబరుగల ఫోర్డ్‌కారు హైటెక్ బస్టాండ్‌లో ఉందని, అందులో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు పోలీసులకు కర్ణాటక పోలీసులు సమాచారమిచ్చారు.
దీంతో డీఎస్పీ అబ్థుల్ రశీద్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు వెళ్లి కారులో సోదాలు చేయగా కోటిన్నర రూపాయల నగదు ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బీజాపూర్ ఐసీఐసీఐ బ్యాంకులో రూ. కోటి 50 లక్షలు చోరీ జరిగింది.

కర్ణాటకలో చోరీ చేసిన కోటి 50 లక్షలు: సూర్యాపేటలో ప్రత్యక్షం, స్వాధీనం
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన కర్ణాటక పోలీసులకు ఆ మొత్తం సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో ఉన్న కారులో భద్రపరచినట్లు వెల్లడైంది. ఈ విషయంపై కర్నాటకలోని బిజ్‌పుర్‌లో పోలీసులకు చిక్కిన నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడి పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటకలో చోరీ చేసిన కోటి 50 లక్షలు: సూర్యాపేటలో ప్రత్యక్షం, స్వాధీనం
కాగా ఈ నగదును ఇటీవల కర్నాటక రాష్ట్రంలోని బీజ్‌పూర్ ఐసిఐసిఐ బ్యాంకులో జరిగిన దోపిడీకి సంబంధించిదిగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై గురువారం రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను తెలిపారు.

కర్ణాటకలో చోరీ చేసిన కోటి 50 లక్షలు: సూర్యాపేటలో ప్రత్యక్షం, స్వాధీనం
తమ శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు హైటెక్‌బస్టాండ్‌లో ఉన్న కారు డిక్కీని బద్దలు కొట్టి అందులో ఉన్న కాటన్, మూటలో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నామని, మొత్తం కోటిన్నర అని, అందులో 20లక్షలు 1000 రూపాయల నోట్లు, మిగిలిన కోటి 30లక్షలు 500నోట్లుగా లభ్యమైనట్లు వివరించారు.

కర్ణాటకలో చోరీ చేసిన కోటి 50 లక్షలు: సూర్యాపేటలో ప్రత్యక్షం, స్వాధీనం
ఆ సొమ్ము కర్నాటకలో బ్యాంకులో చోరీ జరిగిన సొమ్ముగా ప్రచారం జరుగుతున్నందున ఆదిశగా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications