ఎక్కడ, ఎలా?: రూ.500, రూ.1000 నోట్లు ఇలా మార్చుకోవచ్చు, మరిన్ని విషయాలు..

హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయడంతో దేశంలో అలజడి చెలరేగింది. అయితే, వాటిని మార్చుకోవచ్చునని తెలిసి అందరూ ఊరట చెందారు. హఠాత్తుగా నోట్లను రద్దు చేయడంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. అదే సమయంలో నోట్ల రద్దు పేక్ కరెన్సీని అరికట్టడానికి ఉపయోగపడుతుందని ముక్తకంఠంతో చెబుతున్నారు.

కాగా, రూ.500, రూ.1000 నోట్లు రేపటి నుంచి ఎవరూ తీసుకోరు. వాటిని ఎక్కడ, ఎప్పటిలోగా మార్చుకోవచ్చో మోడీ చెప్పారు.

నోట్లు ఎక్కడెక్కడ ఇవ్వొచ్చు?

రూ.500, రూ.1000 నోట్లు మీ వద్ద ఉంటే దుకాణాల్లో, బయట ఎక్కడా తీసుకోరు. అయితే వాటిని పలుచోట్ల మాత్రం తీసుకుంటారు. పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే, ఎయిర్ లైన్స్, బస్ టిక్కెట్ కౌంటర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే బజార్లు, ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే మిల్క్ బూత్‌లు తదితర వాటిల్లో ఇవ్వవచ్చు. వీటిల్లో పాత నోట్లు చెల్లుబాటు అవుతాయి.

పోస్టాఫీస్‌లు, సబ్ పోస్టాఫీస్‌లలో మార్చుకోవచ్చు. అయితే రూ.4000 వేల వరకు పరిమిది. పాన్, ఆధార్, ఎలక్షన్ కార్డు చూపించి మార్చుకోవచ్చు.

black money

గుర్తింపు కార్డుతో వ్యక్తిగత ఖాతాలో వేసుకోవచ్చు

గుర్తింపు కార్డును చూపించి నోట్లు ఓ వ్యక్తి తన అకౌంటులో వేసుకోవచ్చు. వేరే వ్యక్తి అకౌంటులోకి వేయాలంటే సంబంధిత వ్యక్థి అధీకృత లేఖ ఇవ్వాలి.

డిసెంబర్ 30లోగా మార్చుకోవాలి, లేదంటే..

తమ వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్లను డిసెంబర్ 30వ తేదీలోగా మార్చుకోవాలి. లేదంటే మరో అవకాశం కూడా ఇస్తారు. మార్చి 31, 2017లోగా మార్చుకోవచ్చు. ఆర్బీఐ ప్రత్యేక కార్యాలయాల్లో డిపాజిట్ చేసే అవకాశముంది.

మరిన్ని విషయాలు..

- ఏటీఎంల నుంచి రూ.10వేలకు మించి రోజుకు తీయరాదు.
- వారానికి రూ.20 వేలకు మించి తీయరాదు.
- బుధ, గురువారాలు ఏటీఎంలు పని చేయవు.
- ఆ తర్వాత నవంబర్ 18 వరకు ఐటీఎంల నుంచి రూ.2వేలు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత నుంచి రూ.4వేలు వస్తాయి.
- క్రెడిట్, నెట్ బ్యాంకుల లావాదేవీలపై పరిమితి లేదు.
- ఆర్బీఐ నవంబర్ 10వ తేదీ నుంచి రూ.500, రూ.1000 నోట్లు ఇస్తుంది.

మోడీ నిర్ణయంతో ఏం జరుగుతుందంటే..

- నల్లధనం బయటకు వస్తుంది. ఒక వేళ వెల్లడించలేని వాళ్లకు అవి చిత్తుకాగితాలుగానే ఉంటాయి.
- పేద, మధ్యతరగతి ప్రజలకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఎలా అంటే ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నిర్మిస్తున్న నిర్మాణాల్లో ఎక్కువమంది బ్లాక్‌ మనీ కలిగిన వారు ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటారు. దీంతో సామాన్యులకు సొంతింటి కల అందలేని ద్రాక్షగా మిగిలిపోయింది. అయితే తాజా విధానంతో కొన్ని రోజుల్లో ఆ ధరలు దిగి వచ్చే అవకాశముంది.
- ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు ఎక్కువగా నకిలీ కరెన్సీ ద్వారా ఆయుధాలను సమకూర్చుకుంటారు. వీరికి తాజా నిర్ణయంతో ఎలాంటి సాయం అందకపోయే అవకాశముంది.
- విపరీతంగా వ్యాప్తి చెందిన పెద్ద నోట్ల వినియోగం తక్కువ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+