ఇదేం వెర్రి కామెడీ... ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సీరియస్

ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల జోరు పెరిగిపోయింది. ఎక్కడపడితే అక్కడ రీల్స్ , ఛాలెంజ్ వీడియోలు , ప్రాంక్స్ చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం చిరాకు కలిగించే పిచ్చి కామెడీలు చేసి నానా రచ్చ చేస్తున్నారు. ఇక అటువంటి వారి విషయంలో ఆర్టిసి ఎండి వీసీ సజ్జనార్ పోస్ట్ పెట్టారు.

వీడియోను పోస్ట్ చేసి ఘాటుగా స్పందించిన సజ్జనార్
ఏం కామెడీగా ఉందా? ఏంటా పిచ్చి వేషాలు అంటూ సీరియస్ అయిన ఆయన, ఓ వీడియోను పోస్ట్ చేసి ఘాటుగా స్పందించారు. వీసీ సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి కదులుతున్న ఆర్టీసీ బస్సు వద్దకు వెళ్లి, లోపల ఉన్న కండక్టర్ ను గుంటూరు వెళ్లాలంటూ అడుగుతాడు.

RTC MD VC Sajjanar is serious on a youngman who made comedy reel with rtc conductor

కాలికున్న చెప్పు చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్న యువకుడు
ఆర్టీసీ కండక్టర్ ఆ బస్సు గుంటూరు వెళ్లదని చెప్పడంతో, కాలికున్న చెప్పు తీసి చెవి దగ్గర పెట్టుకొని అరే.. ఈ బస్సు గుంటూరు వెళ్ళదు అంటరా అంటూ ఎవరికో చెబుతున్నట్టు యాక్ట్ చేస్తాడు. ఇక ఈ వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్ సదరు వ్యక్తి పైత్యానికి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీడికి ఏమైనా పిచ్చా , వెర్రా?
చెప్పు చెవి దగ్గర పెట్టుకుని స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు సదరు యువకుడు వెళ్లి పోతుండడంతో బస్సులో ఉన్న ప్రయాణికులతో పాటు రోడ్డు మీద ఉన్న ప్రయాణికులు కూడా అతని వంకే చూస్తారు. వీడికి ఏమైనా పిచ్చా , వెర్రా అన్నట్టు అతని పైనే అందరి దృష్టి పడుతుంది.

ఇదేం వెర్రి కామెడీ.. సజ్జనార్ ప్రశ్న
ఇక ఈ వీడియోని పోస్ట్ చేసిన సజ్జనార్ ఇదేం వెర్రి కామెడీ అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చి వేషాలు అయినా వేస్తారా అంటూ ఆయన తన పోస్టు ద్వారా ప్రశ్నించారు. మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!? అని అసహనం వ్యక్తం చేశారు.

కఠిన చర్యలు తీసుకుంటాం
కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు అని సజ్జనార్ తేల్చి చెప్పారు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక సజ్జనార్ చేసిన పోస్టుతో ఇటువంటి వారిపై కఠినమైన చర్య తీసుకోవాలని ఒకరికి బుద్ధి చెప్తే మిగతావారు కూడా దారిలోకి వస్తారని నెటిజన్లు స్పందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+