రమ్మీ జూదంకాదు...నైపుణ్యాన్ని వెలికితీసే క్రీడ
పేకముక్కలతో ఆడే రమ్మీ జూదం కాదని, నైపుణ్యాన్ని వెలికితీసే క్రీడనఅ హైకోర్టులో సుప్రీంకోర్టు న్యాయవాది ఎకె గంగూలీ వాదించారు.
హైదరాబాద్:పేకముక్కలతో ఆడే రమ్మీ జూదం కాదని, నైపుణ్యాన్ని వెలికితీసే క్రీడనఅ హైకోర్టులో సుప్రీంకోర్టు న్యాయవాది ఎకె గంగూలీ వాదించారు.
అన్ లైన్ రమ్మీని నిషేధిస్తూ తెలంగాణ సర్కార్ ఈ నెల 17న ఆర్డినెన్స్ ను జారీ చేసింది. దీనిని ముంబైకి చెందిన పలు రమ్మీ క్రీడా నిర్వహణ సంస్థలు వ్యతిరేకిస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాయి.
అయితే ఈ విషయమై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథన్ న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం నాడు విచారించింది.

ధర్మాసనం ఎదుట గంగూలీ వాదించారు.రమ్మీ ఆట జూదం కాదన్నారు. నైపుణ్యాన్ని వెలికితీసే క్రీడ అని చెప్పారు. పైగా సుప్రీంకోర్టు కూడ ఇతర కేసుల్లో రమ్మీ జూదం కాదని, గతంలో తీర్పు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఈ కేసుల్లో వాదనలు అసంపూర్తిగా జరగడంతో బుదవారం కూడ విచారణ కొనసాగిస్తామని ధర్మాసనం ప్రకటించింది.












Click it and Unblock the Notifications