ఫ్రాన్స్ యువకుడితో ఛాటింగ్ భరించలేకపోయా, చంపేశా: సింథియా భర్త
హైదరాబాద్: ఆఫ్రికా దేశానికి చెందిన తన భార్య సింథియాను తాను ఎలా హత్య చేసింది నిందితుడు రూపేష్ అగర్వాల్ పోలీసు విచారణలో వెల్లడించాడు. కావాలనే తాను ఆమెను హత్య చేసినట్లు అతను అంగీకరించాడు. మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి హత్యకు సంబంధించిన వివరాలను రాబట్టారు.
రూపేష్ చెప్పిన విషయాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఫ్రాన్స్ యువకుడి తన భార్య సింథియా చాటింగ్ చేయడం నచ్చలేదని, అందుకే చంపేశానని చెప్పాడు. భయం కారణంగానే ఆమె శవాన్ని ముక్కలు చేశానని చెప్పాడు. భార్య శవం ముక్కలను దహనం చేయడానికి శంషాబాద్ వెళ్తున్నప్పుడు కూతురు వస్తానని చెప్పిందని, దాంతో ఆమెను కూడా తీసుకుని వెళ్లానని చెప్పాడు.

కూతురితో పాటు ఫ్రాన్స్ వెళ్లాలని సింథియా భావించిందని, అయితే కూతురంటే తనకు ఎనలేని ప్రేమ అని, దాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని చెప్పాడు. ఇటీవల హైదరాబాదులో రూపేష్ అనే స్టాక్ బ్రోకర్ తన భార్య సింథియాను దారుణంగా చంపేసి, శవాన్ని ముక్కలు చేసి శంషాబాద్ ప్రాంతంలో తగులబెడుతుండగా పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.
ఆ హత్య హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. సింథియా కూతురు ఎవరి వద్ద ఉండాలనే విషయంపై కూడా వివాదం కొనసాగుతోంది. ఈ స్థితిలో నిందితుడు రూపేష్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు.












Click it and Unblock the Notifications