Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ : త్వరలో ఆర్టీసీ చార్జీల బాదుడుకు రంగం సిద్ధం!!

అసలే పీకల్లోతు నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీ నష్టాల నుండి బయట పడటం కోసం చార్జీల పెంపును చేపట్టాలని నిర్ణయించింది. గత డిసెంబర్ లోనే ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. సీఎం కేసీఆర్ ఓకే అంటే ఆ మేరకు చార్జీలు పెంచడానికి తెలంగాణ ఆర్టీసీ రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఊహించని విధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీని మరోమారు పునరాలోచనలో పడేశాయి.

ఆర్టీసీ చార్జీలపై పాత ప్రతిపాదనకు బదులు కొత్త ప్రతిపాదన

ఆర్టీసీ చార్జీలపై పాత ప్రతిపాదనకు బదులు కొత్త ప్రతిపాదన


ఇంతకు ముందు పెట్టిన ప్రతిపాదనను సవరించి కొత్త ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. తాజా ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరిస్తే ఇక ఆర్టీసీ చార్జీలు అనూహ్యంగా పెరుగుతాయని ఓ అంచనా. కిలోమీటర్ కు 40 పైసల నుంచి 50 పైసల వరకు పెంచేలా తాజా ప్రతిపాదనను ఆర్టీసీ రూపొందిస్తున్నట్టు సమాచారం. పాత ప్రతిపాదన ప్రకారం ఏటా ప్రజలపై 850 కోట్ల రూపాయల భారం పడనుంది. ఇక సవరిస్తున్న కొత్త ప్రతిపాదన ప్రకారం అది 1200 కోట్ల రూపాయలుగా ఉండనుందని ఆర్టీసీ వర్గాల సమాచారం.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఆమోదం పొందే యత్నాల్లో ఆర్టీసీ

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఆమోదం పొందే యత్నాల్లో ఆర్టీసీ


ఇక ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సవరించిన కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరిస్తే సామాన్యుల జేబులకు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే ఆర్టీసీ పై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి రెండు మూడు రకాల కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసి ప్రభుత్వంతో ఆమోదం పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఆర్టీసీ.

పీకల్లోతు నష్టాల్లో ఆర్టీసీ.. పెరిగిన డీజిల్ ధరలతో మరింత కష్టాలలోకి

పీకల్లోతు నష్టాల్లో ఆర్టీసీ.. పెరిగిన డీజిల్ ధరలతో మరింత కష్టాలలోకి


ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్టీసీ నష్టం రెండు వేల కోట్లకు చేరుకునేలా ఉంది. ఆర్టీసీ నెలకు 18 కోట్ల నుంచి 20 కోట్ల లీటర్ల డీజిల్ ను వినియోగిస్తోంది. ఈ డీజిల్ ను చమురు సంస్థల నుండి బల్క్ గా కొంటోంది. ఈ ఒప్పందం మేరకు రిటైల్ కంటే లీడర్ పై నాలుగు రూపాయల వరకు తగ్గింపు పొందుతోంది. ఫిబ్రవరి 16 వరకు ఆర్టిసి అనే డీజిల్ ధర లీటర్ 91 రూపాయలుగా ఉంది. అది ఫిబ్రవరి 17 నాటికి ఒక్కసారిగా పెరిగి 97 రూపాయలకు చేరుకుంది. దీంతో సంస్థ బల్క్ గా కొనుగోలు చేయడాన్ని ఆపి రిటైల్ గా కొనుగోలు చేయడాన్ని ప్రారంభించింది. ఇక ప్రస్తుతం అయితే బల్క్ డీజిల్ ధర 104 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధర విపరీతంగా పెరగడంతో ఆర్టీసీ చార్జీలు పెంచడం తప్ప కష్టాల నుంచి గట్టెక్కడానికి ఆర్టీసీకి మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.

Recommended Video

    #RussiaUkraineConflict: దిక్కుతోచని స్థితిలో Indian Students సవాల్ గా Operation Ganga | Oneindia
     రష్యా ఉక్రెయిన్ యుద్ధ ఫలితం: విపరీతంగా చార్జీలను పెంచనున్న తెలంగాణా ఆర్టీసీ

    రష్యా ఉక్రెయిన్ యుద్ధ ఫలితం: విపరీతంగా చార్జీలను పెంచనున్న తెలంగాణా ఆర్టీసీ

    నష్టాల నుండి బయటపడడానికి ఆర్టీసీ గత డిసెంబర్లో కిలోమీటర్ కు ఆర్డినరీ బస్సులపై 25 పైసలు, మిగతా కేటగిరీల బస్సులపై 30 పైసలు పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించింది. దీనిపై ఆమోదం రాక ముందే ఇదే సమయంలో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు గా రష్యా ఉక్రెయిన్ యుద్ధం తెలంగాణా ఆర్టీసీని మరింత కుదేలు చేస్తుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్న పరిస్థితుల్లో ఆర్టీసీ పాత ప్రతిపాదనలకు బదులు, మరోమారు చార్జీల పెంపుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏది ఏమైనా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం తో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సామాన్య ప్రయాణికులపై ముందు ముందు పెనుభారం పడబోతుంది అన్నది నిర్వివాదాంశం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+