హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాలమూరులో రైతు బజారు: హరీశ్, కేసీఆర్‌వి తుగ్లక్ నిర్ణయాలు: నాగం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా పేరొందిన మహబూబ్ నగర్ జిల్లాకు తాజాగా రైతు బజార్ మంజూరైంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మహబూబ్ నగర్‌కు మంజూరైన రైతు బజార్‌ను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేస్తామన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా రైతులు కూరగాయలను పండించడంలో తమ ప్రత్యేకతను చాటుతున్నారని పేర్కొన్నారు. రైతలు పండించిన పంటను అమ్ముకోవడానికి జిల్లాలో సరైన సదుపాయం లేదని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం మహబూబ్‌నగర్‌కు రైతు బజార్‌ను మంజూరు చేసిందని తెలిపారు.

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు కొనుగోలుదారులకు స్వచ్ఛమైన కూరగాయాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు.

Rythu bazar sanctioned in mahaboobnagar district

సెప్టెంబర్ 17కు సీఎం కేసీఆర్ తప్పుడు నిర్వచనం: నాగం జనార్ధన్ రెడ్డి

తెలంగాణ చరిత్రలో కీలకమైన సెప్టెంబర్ 17కు సీఎం కేసీఆర్ తప్పుడు నిర్వచనం ఇస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకంలో టెండర్లు కొందరికి అనుకూలంగా ఉన్నాయని మండిపడ్డారు.

టెండర్లకు పిలిచిన కాంట్రాక్టర్లలో ఒక్కరు తప్ప అందరూ ఆంధ్రావాళ్లేనని ఆయన తెలిపారు. ఓ వర్గం నోట్ల కోసమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. సీఎం కేసీఆర్ తుగ్లక్‌ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఖాసీం చంద్రశేఖర్ రజ్వీలా కేసీఆర్ పరిపాలన ఉందని మండిపడ్డారు.

English summary
Rythu bazar sanctioned in mahaboobnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X