సజ్జనార్ మార్క్ ఆర్టీసీ బిజినెస్: త్వరలో ఇళ్ళనుండి పార్సిళ్ళ సేకరణ, డెలివరీ!!
తెలంగాణ ఆర్టీసీలో ఎండిగా సజ్జనార్ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆర్టీసీని లాభాల బాటలో ముందుకు తీసుకువెళ్లాలని అనేక విధాలుగా సజ్జనార్ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతున్నా, ప్రత్యామ్నాయ మార్గాలలో ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచడానికి ఆయన అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్ విభాగ నెట్వర్క్ ను మరింత పెంచాలని భావిస్తున్న రోడ్డు రవాణా సంస్థ ఎండి సజ్జనార్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో లాజిస్టిక్స్ విభాగం సేవలను అందిస్తుంది. బస్సుల ద్వారా పార్సిళ్ళ రవాణా జోరుగా కొనసాగుతుంది. ఇది ఆర్టీసీకి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.

అయితే ఇందులో మరో అడుగు ముందుకు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందజేయడానికి, త్వరలోనే ఇంటి నుంచి పార్సిళ్ళ సేకరణ, డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. తాజాగా దిల్ సుఖ్ నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ మోడల్ కౌంటర్ ను ప్రారంభించిన క్రమంలో, ఎండి ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.
తెలంగాణ ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ద్వారా ప్రతిరోజు సగటున 15 వేల పార్సిల్స్ ను బట్వాడా చేస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్సిల్స్ ను బస్సులలో రవాణా చేశామని సజ్జనార్ వెల్లడించారు. మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో తమకు ఈ విభాగం ద్వారా 120 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. ప్రస్తుతం దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఇళ్ల నుండి వస్తువుల సేకరణ, డెలివరీ సేవలు ప్రారంభించామన్నారు.
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని సజ్జనార్ వెల్లడించారు. ఏది ఏమైనా ఆర్టీసీని నష్టాలలో పడనీయకుండా, లాభాల బాటలో నడిపించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీలో అడుగుపెట్టిన నాటినుండి తన మార్కు చూపిస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications