TSRTC: మహిళా కండక్టర్ల భద్రతకోసం కీలక ఉత్తర్వులు... సజ్జనార్ నిర్ణయంతో వారి సంబరాలు

ఒకప్పుడు ఆర్టీసీ అంటే... ప్రజా రవాణాకు పనిచేసే నష్టాల్లో నడుస్తున్న, మరుగున పడిపోయినట్టుగా చాలా మంది భావించిన సంస్థ. కానీ ఇప్పుడు ఆర్టీసీ అంటే సరికొత్త నిర్ణయాలతో, సంస్కరణలతో, ఆధునిక సమాజ అవసరాలను గుర్తిస్తూ, తదనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్న సంస్థ. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆర్టీసీ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. నిత్యం కొత్త నిర్ణయాలు, సంస్కరణలతో ఆర్టీసీ దూకుడుగా ముందుకు వెళుతోంది. సంస్థ ఆదాయాన్ని పెంచటానికి పలు మార్గాలను అన్వేషిస్తూనే, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలను చేపడుతుంది.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయాలు,సంస్కరణలతో ఆర్టీసీ దూకుడు

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయాలు,సంస్కరణలతో ఆర్టీసీ దూకుడు


ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఆర్టీసీ లో పనిచేసే మహిళా ఉద్యోగినుల అవసరాలను గుర్తించి ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీ లో పనిచేసే మహిళా ఉద్యోగినులకు డబల్ డ్యూటీ లు లేకుండా చూడడం, మహిళా ఉద్యోగినుల సౌకర్యార్థం వారికి తగిన విధంగా టాయిలెట్ సౌకర్యాలు కల్పించడం, మహిళా ఉద్యోగినులు పనిచేసేలా వారికి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఆర్టీసీ డిపోలలో కల్పించేలా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

 మహిళా కండక్టర్ ల భద్రత కోసం కీలక ఉత్తర్వులు జారీ

మహిళా కండక్టర్ ల భద్రత కోసం కీలక ఉత్తర్వులు జారీ

ఆర్టీసీ బస్సులలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కండక్టర్ల భద్రతను పరిగణలోకి తీసుకొని మహిళా కండక్టర్ లు రాత్రి 8 గంటలకల్లా తమ డిపోలకు చేరుకునేలా డ్యూటీలు ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కండక్టర్ ల భద్రతను దృష్టిలో ఉంచుకొని సజ్జనార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేయడం కోసం, తాజాగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రావాలని సజ్జనార్ అధికారులకు సూచించారు.

గతంలో కేసీఆర్ ఆదేశాలతో అమలైన విధానం, మధ్యలో మళ్ళీ బ్రేక్

గతంలో కేసీఆర్ ఆదేశాలతో అమలైన విధానం, మధ్యలో మళ్ళీ బ్రేక్

గతంలోనూ మహిళా కండక్టర్ లు రాత్రి విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా మారుతుందని, రాత్రి ఎనిమిది గంటల డ్యూటీ ముగిసేలా తమకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. 2019 డిసెంబర్ లో అన్ని స్థాయిల ఉద్యోగులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో రాత్రి సమయాల్లో విధులు నిర్వహించటం మహిళా కండక్టర్ లకు ఇబ్బందిగా మారుతుందన్న అంశం తెర మీదకు వచ్చింది. దీంతో మహిళా కండక్టర్ల అభ్యర్థన మేరకు రాత్రి సమయాల్లో ఎనిమిది గంటలకల్లా డ్యూటీ ముగిసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కెసిఆర్ ఆదేశించారు.

మహిళా ఉద్యోగినుల సమస్యలపై దృష్టి పెట్టిన సజ్జనార్ .. రాత్రి 8 గంటల వరకే మహిళా కండక్టర్ల డ్యూటీలు

మహిళా ఉద్యోగినుల సమస్యలపై దృష్టి పెట్టిన సజ్జనార్ .. రాత్రి 8 గంటల వరకే మహిళా కండక్టర్ల డ్యూటీలు


కొద్ది రోజులపాటు ఈ విధానాన్ని అమలు చేసిన అధికారులు, ఆ తర్వాత ఈ విధానాన్ని రద్దు చేశారు. దీంతో ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ మహిళా ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారిస్తున్న నేపద్యంలో మహిళా కండక్టర్ నుంచి విజ్ఞప్తులు వెల్లువగా మారాయి. దీంతో సజ్జనార్ మరోసారి ఆర్టీసీ కండక్టర్ లకు రాత్రి 8 గంటల కల్లా డ్యూటీలు ముగిసేలా అధికారులు విధులను కేటాయించాలని మరోమారు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీసుకున్న నిర్ణయంతో మహిళా కండక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+