వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజూర్ నగర్ ఎన్నికల బరిలో శంకరమ్మ ? గులాబీ పార్టీ నుండి నో ఛాన్స్ !!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన క్రమంలో హుజూర్ నగర్ లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది . ఇక ఈసారైనా అక్కడ నుండి టిక్కెట్ ఆశిస్తున్నారు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. కానీ గులాబీ బాస్ గత ఎన్నికల సమయంలోనే ఆమెకు మొండిచేయి ఇచ్చారు. ఇక ఇప్పుడు కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలనుకుంటున్న క్రమంలో శంకరమ్మ కు టికెట్ ఇచ్చే అవకాశమే లేదని తేలిపోయింది.

ఇది ట్రయిలర్ మాత్రమే ఇంకా చాలా సినిమా ఉంది .. రివర్స్ టెండరింగ్ పై మంత్రి అనీల్ఇది ట్రయిలర్ మాత్రమే ఇంకా చాలా సినిమా ఉంది .. రివర్స్ టెండరింగ్ పై మంత్రి అనీల్

శంకరమ్మ విషయంలో గులాబీ బాస్ సైలెంట్

శంకరమ్మ విషయంలో గులాబీ బాస్ సైలెంట్

తెలంగాణ ఉద్యమకారులకు పాలనలో స్థానం కల్పిస్తామని చెప్పి గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ విషయంలో ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అగ్నికి ఆహుతి అయిన అమరుడు శ్రీకాంతాచారి. అంతటి గొప్ప ఉద్యమకారుడి తల్లికి టీఆర్ ఎస్ లో ఆది నుంచి ప్రాధాన్యత లేదన్నది ఉద్యమకారుల ఆరోపణ.

2014లో పోటీ చేసిన ఓడిన శంకరమ్మ

2014లో పోటీ చేసిన ఓడిన శంకరమ్మ

2014 ఎన్నికల్లో పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పై శంకరమ్మను పోటీచేయించారు కెసిఆర్. కనీసం ఆమెకు టీఆర్ఎస్ పార్టీ నుండి ఆర్థిక అండదండలు కూడా అందించలేదన్న విమర్శలున్నాయి.అక్కడ ఆమె గెలవదని తెలిసే గులాబీ బాస్ ఆ సీటు ఇచ్చారన్న విమర్శలున్నాయి.ఇక అప్పటినుండి ఇప్పటివరకు శంకరమ్మ మరోమారు కెసిఆర్ తనకు అవకాశమిస్తారని ఎదురుచూస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుతున్న ఆమెకు గత ఎన్నికల సమయంలో హుజూర్ నగర్ టికెట్ దక్కలేదు.

ఉప ఎన్నిక నగారా మోగటంతో గులాబీ టికెట్ పై చర్చ

ఉప ఎన్నిక నగారా మోగటంతో గులాబీ టికెట్ పై చర్చ

ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచి రాజీనామా చేయడంతో మళ్లీ ఉప ఎన్నిక వచ్చింది. ఇక ఎన్నికల నగారా మోగటంతో టికెట్ ఎవరికి ఇస్తారు అన్నదానిపై చర్చ సాగుతుంది. ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని శంకరమ్మ వేడుకుంటున్నా టీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోవడం లేదు.ఉత్తమ్ పై గత ఎన్నికల్లో పోటీ చేసిన సైదిరెడ్డి కి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన సైతం చేస్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో మంత్రి జగదీశ్‌ రెడ్డి అనుచరుడైన సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా నిలిపిన గులాబీ పార్టీఉత్తమ్‌కు గట్టి పోటీ ఇచ్చి కేవలం 7వేల ఓట్ల తేడాతో ఓటమిపాలైంది . ఈనేపథ్యంలో మరో సారి టిక్కెట్‌ సైదిరెడ్డికే ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు.

కవితను ఎన్నికల బరిలోకి దించే ఆలోచనలో కేసీఆర్

కవితను ఎన్నికల బరిలోకి దించే ఆలోచనలో కేసీఆర్

నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన కేసీఆర్ తనయ కవితను బరిలోకి దింపుతారన్న వార్తలు సైతం ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఇప్పటికే అభ్యర్థిగా ఉత్తమ్ భార్య పద్మావతి అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఈసారైనా సీఎం కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వాలని, లేదంటే శంకరమ్మ ఒంటరిగా హుజూర్ నగర్ లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఒంటరిగా పోటీ చేస్తా అంటున్న శంకరమ్మ

ఒంటరిగా పోటీ చేస్తా అంటున్న శంకరమ్మ

అంతేకాదు తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లిగా తనకు అన్ని పార్టీలు పోటీ పెట్టకుండా మద్దతు ఇవ్వాలని కోరుతోంది. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల గురించి ఊక దంపుడు ఉపన్యాసాలు చేసే రాజకీయ పార్టీలు, ఒక ఉద్యమకారుడు తల్లిగా ఎన్నికల్లో పోటీ చేస్తానంటే ఏ రాజకీయ పార్టీ తనకు సహకారం అందించడం లేదని శంకరమ్మ వాపోతున్నారు. ఒంటరిగా అయినా సరే ఎన్నికల బరిలోకి దిగడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. హుజూర్ నగర్ నుంచి కవిత పోటీ చేస్తే తాను పోటీ నుండి విరమిస్తానని, మరి ఎవరికి టిక్కెట్ ఇచ్చినప్పటికీ తాను పోటీ చేస్తానని శంకరమ్మ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి జరగనున్న ఉప ఎన్నికల్లో శంకరమ్మ ఏం చేయనున్నారు అనేది మరి కొద్దిరోజుల్లోనే తేలనుంది.

English summary
Political heat in Huzur Nagar is rising as the schedule for Huzur Nagar by-election is released in Telangana state. Sankaramamma is the mother of Srikantachari, the activist who sacrificed his life for Telangana. But the TRS boss didn't give her ticket during the last election. It is now revealed that there is no possibility of giving a ticket to Sankaramma in order to field a strong candidate
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X