సారిక పక్కటెముకలు నుజ్జు నుజ్జు: పిల్లల పరిస్థితి కూడా..
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె కుమారుల మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో అనూహ్యమైన, దిగ్భ్రాంతికరమైన విషయాలు బయపడ్డాయి. ఆ నలుగురు ఇంట్లో సజీవ దహనమైన విషయం తెలిసిందే.
ఈ నలుగురి మృతదేహాలకు గురువారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో పలు కీలక విషయాలను షార్ట్ రిపోర్ట్ ద్వారా పోలీసులకు నివేదించారు. సారిక పక్కటెముకల్లో ఆరు నుజ్జునుజ్జయ్యాయని నిపుణులు గుర్తించినట్టు తెలిసింది. ఇద్దరు చిన్నారులకు కాళ్లు, మరొకరికి రెండు చేతులు పూర్తిగా విరిగిపోయాయని నివేదికలో చెప్పినట్లు సమాచారం.
అగ్నికీలల్లో చిక్కుకుని, కాలిపోతూ దాదాపు రెండున్నర గంటలపాటు సారిక, ముగ్గురు పిల్లలు ఆర్తనాదాలు చేసి, నరకయాతన అనుభవించి చనిపోయి ఉంటారని పోస్టుమార్టం షార్ట్ నివేదికలో వైద్యులు తెలిపినట్టు సమాచారం. ముగ్గురి ఊపిరితిత్తుల్లోనూ పొగ తాలూకు అవశేషాలు గుర్తించినట్లు తెలుస్తున్నది.

దానికితోడు, ఈ కేసులో పోలీసులకు అనేక సందేహాలు, అనుమానాలను వస్తున్నాయి. అగ్నికీలల్లో దహించుకుపోతూ సారిక, ఆమె ముగ్గురు పిల్లలు చేసిన ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదా? వంటగదిలో ఉండాల్సిన గ్యాస్ సిలిండర్లు బెడ్‌రూమ్‌లోకి ఎలా వచ్చాయి? దారుణం జరుగటానికి ముందు జరిగినట్టు చెప్తున్న ఘర్షణకు, వీరి మరణాలకు సంబంధం ఉందా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
మృతదేహాలు గదిలో తలుపులకు దగ్గరగా ఎందుకు పడి ఉన్నాయనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఆ నలుగురి హత్య జరిగిందనే కోణంలోనే ఎక్కువగా దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications